Begin typing your search above and press return to search.

జస్ట్ యాక్షన్ డోస్ సరిపోదేమో..

పాతకాలపు స్పై ఫార్ములా, బలహీనమైన కథనమే దీనికి పెద్ద మైనస్ గా మారాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

By:  M Prashanth   |   13 July 2026 11:03 AM IST
జస్ట్ యాక్షన్ డోస్ సరిపోదేమో..
X

ఉత్తరాది సినిమా మార్కెట్ లో ప్రేక్షకుల అభిరుచి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. పఠాన్, టైగర్ లాంటి భారీ యాక్షన్, స్పై థ్రిల్లర్లను బాగానే ఎంజాయ్ చేసిన ఆడియన్స్, ఇప్పుడు కంటెంట్ ట్రీట్‌మెంట్ లో కొత్తదనాన్ని ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ లో లేటెస్ట్ గా వచ్చిన ఆల్ఫా సినిమా ఫలితాన్ని గమనిస్తే ఇండస్ట్రీకి ఒక బలమైన మెసేజ్ అందినట్లు చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్, క్రేజీ కాస్టింగ్ ఈ సినిమాను కాపాడలేకపోయాయి.

పాతకాలపు స్పై ఫార్ములా, బలహీనమైన కథనమే దీనికి పెద్ద మైనస్ గా మారాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రేక్షకులు రొటీన్ దేశభక్తి, యాక్షన్ జోనర్లకు పూర్తిగా దూరంగా జరుగుతున్నారనే అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాకపోవచ్చు. కేవలం జోనర్ వల్ల కాకుండా, కంటెంట్ లో లోపం వల్లే ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయనే వాదన కూడా ఉంది. గతంలో వచ్చిన కొన్ని స్పై సినిమాల్లో కాస్త అతిగా అనిపించే సీన్లు ఉన్నప్పటికీ ఆడియన్స్ పెద్దగా పట్టించుకునే వారు కాదు.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్క్రిప్ట్ లో కాస్త ఆ పాత ఫీల్ వచ్చినా కూడా, సినిమాలో ఎంత హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా సరే బాక్సాఫీస్ ఎఫెక్ట్ పడుతోంది. ప్రేక్షకులు ఇప్పుడు కొత్త తరహా కంటెంట్ తో పాటు ఒక న్యూ ఫీల్ ని కోరుకుంటున్నారు. అది ఏ జోనర్ సినిమా అయినా సరే, ప్రెజెంటేషన్ కొత్తగా ఉంటే థియేటర్లకు రావడానికి ఆడియన్స్ రెడీగా ఉంటున్నారు.

ఇదే టైమ్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ విచిత్రమైన ధోరణి కూడా కనిపిస్తోంది. కథలో పెద్దగా డెప్త్ లేకపోయినా, సింపుల్ ఎంటర్ టైన్ మెంట్ ని నమ్ముకున్న వెల్ కమ్ టు ది జంగిల్, ధమాల్ 4 వంటి సినిమాలు పెద్ద ఎత్తున వసూళ్లను సాధించడం హైలెట్. థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ఎలాంటి ఒత్తిడి లేకుండా కాసేపు నవ్వుకోవడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనీ అనిపిస్తోంది. ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలకు కాస్త అడ్వాంటేజ్ కలిసి వస్తుందనేది ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయం.

ఇప్పుడు అందరి కళ్లూ బాలీవుడ్ లో రాబోయే నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్టుల మీదే ఉన్నాయి. ముఖ్యంగా మాతృభూమి సినిమాతో పాటు రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే దానిపైనే బాలీవుడ్ మార్కెట్ మొమెంటం ఆధారపడి ఉంటుంది. పాత ఫార్ములాల నుంచి బయటకు వచ్చి ఈ సినిమాలు కొత్త ట్రీట్ మెంట్ తో ఆకట్టుకుంటాయో లేదో చూడాలి. సినిమా సక్సెస్ ని ముందే ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. ఒక జోనర్ ఫ్లాప్ అయిందని ఆ తరహా కథలు ఇక ఆడవని బల్లగుద్ది చెప్పలేం, అలాగే కామెడీ సినిమాలే ఎప్పుడూ కాపాడుతాయని అనుకోలేం. మారిన నేటి తరం ప్రేక్షకుల పల్స్ ని పట్టుకుని కరెక్ట్ గా ఎగ్జ్యూక్యూట్ చేసిన చిత్రాలే నిలబడతాయనీ చెప్పవచ్చు.