వైట్ గౌన్ లో అదిరిపోయేలా అల్లు కోడలు.. పిక్స్ చూశారా?
అల్లు స్నేహ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగా, బిజినెస్ మ్యాగ్నెట్ గా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు
By: M Prashanth | 22 Aug 2025 10:32 PM ISTఅల్లు స్నేహ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగా, బిజినెస్ మ్యాగ్నెట్ గా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. అల్లు వారి కోడలుగా అటు ఫ్యామిలీ లైఫ్ ను.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను డీల్ చేస్తున్నారు. అదే సమయంలో తన ఫ్యాషన్ సెన్స్ తో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతుంటారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ మూవీతో ఫుల్ బిజీగా ఉండగా.. స్నేహా రెడ్డి ఇప్పుడు పారిస్ లో సందడి చేస్తున్నారు. ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. బ్యూటిఫుల్ వైట్ కలర్ గౌను ధరించి కనిపించారు. లేత గోధుమరంగు హ్యాండ్ బ్యాగ్ ను పట్టుకున్న ఆమె.. హెయిర్ లీవ్ చేసి బ్లాక్ కలర్ కూలింగ్ గ్లాసెస్ తో మెరిసిపోయారు.
ఇప్పుడు స్నేహా రెడ్డి పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. స్నేహా రెడ్డి లుక్ వేరే లెవెల్ లో ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వైట్ కలర్ గౌనులో హీరోయిన్ కు మించిన అందంతో ఆకట్టుకుంటున్నారని చెబుతున్నారు. మేడమ్ సర్.. మేడమ్ అంతే సందడి చేస్తూ పిక్ ను తెగ వైరల్ చేస్తున్నారు.
అయితే స్నేహా రెడ్డి.. ఎప్పుడూ తన ఫ్యాషన్ సెలక్షన్స్ తో మెప్పిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పారిస్ వీధుల్లో దిగిన లేటెస్ట్ పిక్స్.. మరోసారి ఆమె క్లాసీ స్టైల్ ను హైలైట్ చేస్తున్నాయని చెప్పాలి. యూరోపియన్ వైబ్ తో స్టైలిష్ గా ఉన్న స్నేహాకు ఎప్పుడు ఎలా ఉండాలో బాగా తెలుసని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా.. స్నేహా రెడ్డి రాజకీయ నాయకుని కుమార్తె. నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూతురైన స్నేహను.. తొలిసారి ఓ వివాహంలో బన్నీ చూశారట. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరగ్గా, అది కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి 2010లో నిశ్చితార్థం చేసుకున్న వారిద్దరూ.. 2011లో వివాహం చేసుకున్నారు.
అయితే సాంకేతిక రంగాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు వారి కోడలు.. 2016లో స్టూడియో పికాబూ స్థాపించారు. ఆన్ లైన్ ఫోటోగ్రఫీ వెంచర్ విస్తరిస్తోంది. స్నేహభారతి ప్రాపర్టీస్ LLP, అల్లు ఎ స్క్వేర్ LLP స్టూడియో, పికాబూ ఇమేజ్ LLP వంటి బహుళ కంపెనీల్లో ఆమె భాగస్వామిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అలా అటు వ్యాపారం.. ఇటు కుటుంబ జీవితం.. రెండింటినీ సమతుల్యం చేసుకుని ముందుకెళ్తున్నారు స్నేహ.
