కొత్త జంట 'విరోష్' నేరుగా అల్లువారింటికి..!
టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న 'విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న' (విరోష్) పెళ్లి పీటలెక్కిన తర్వాత తమ కొత్త జీవితాన్ని ఎంతో సందడిగా గడుపుతున్నారు.
By: Sivaji Kontham | 1 March 2026 9:35 PM ISTటాలీవుడ్‌లో అత్యంత క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న 'విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న' (విరోష్) పెళ్లి పీటలెక్కిన తర్వాత తమ కొత్త జీవితాన్ని ఎంతో సందడిగా గడుపుతున్నారు. ఈ కొత్త జంట పెళ్లయిన వెంటనే మరో గ్రాండ్ సెలబ్రేషన్‌లో భాగం కావడానికి సిద్ధమయ్యారు. మెగా - అల్లు ఫ్యామిలీలో అల్లు శిరీష్ వివాహ వేడుకలు మొదలవడంతో `విరోష్` జంట నేరుగా అల్లు వారి ఇంటికి చేరుకొని సందడి చేశారు.

ప్రస్తుతం అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లికొడుకుగా ముస్తాబైన శిరీష్‌ను ఆయన ఇంటికి వెళ్లి కలిసి విజయ్, రష్మిక తమ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ కొత్త జంటను చూసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బన్ని అన్నతో విజయ్ కొంత సేపు ముచ్చటిస్తూ కనిపించారు. కొత్త పెళ్లికొడుకు విజయ్, కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న అగ్రనిర్మాత అల్లు అరవింద్ ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్భంగా కొత్త జంటను చూసిన అతిథులు, అభిమానులు సోషల్ మీడియాలో వారి ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. కొత్తగా పెళ్లయిన ఈ జంటలో కనిపిస్తున్న సంతోషం అల్లు వారి ఇంటి వేడుకల్లో మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అయితే కొత్తగా పెళ్లయిన ఈ జంటకు అప్పుడే వరుసగా ఠఫ్ షెడ్యూల్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం విజయ్ - రష్మిక పెళ్లి తర్వాత అనుసరించాల్సిన వివిధ ఆచారాలు, సంప్రదాయాలను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ వారమంతా వారు వివిధ పూజా కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారని సమాచారం. అందుకే శిరీష్ ఇంటి వద్ద జరుగుతున్న వేడుకలకు హాజరై.. ఆ తర్వాత తమ గృహ కృత్యాల్లో బిజీ అవుతారు.
అల్లు శిరీష్-నయనికల వివాహం ఒక ఎగ్జోటిక్ విదేశీ లొకేషన్‌లో జరగనుంది. మార్చి 4వ తేదీన విజయ్ - రష్మిక జంట రిసెప్షన్ పూర్తయిన వెంటనే అల్లు శిరీష్ వివాహ వేడుక కోసం చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా తరలివెళ్లనున్నారు. విజయ్ దేవరకొండ -రష్మిక జంట కూడా తమ పెళ్లి అనంతర ఆచారాలను పూర్తి చేసుకుని, `మార్చి 6న జరగనున్న శిరీష్ వివాహ మహోత్సవానికి హాజరయ్యేందుకు ఛాన్సుంది.
మొత్తానికి `విరోష్` పెళ్లితో మొదలైన సెలబ్రేషన్స్ ఇప్పుడు అల్లు వారి పెళ్లికి కూడా పాకాయి. ఒకవైపు తమ కొత్త జీవితాన్ని ఆస్వాధిస్తూనే మరోవైపు సన్నిహితుల వేడుకల్లో పాల్గొంటూ ఈ జంట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో `విరోష్`....శిరీష్-నయనిక జంటలకు అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు.
