పిక్‌టాక్ : వెడ్డింగ్ పార్టీలో స్టైలిష్ ఐకాన్ ఫ్యామిలీ
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ వెడ్డింగ్ హడావిడి మొదలైంది.
By: Ramesh Palla | 4 March 2026 10:40 AM ISTటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ వెడ్డింగ్ హడావిడి మొదలైంది. గత కొన్ని రోజులుగా పార్టీలు, పలు కార్యక్రమాలతో అల్లు ఫ్యామిలీ బిజీ బిజీగా ఉంది. తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరు అయిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శిరీష్ వివాహ కార్యక్రమాలు మొదలైనప్పటి నుంచి అల్లు అర్జున్ చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ, పెళ్లి పనులతో బిజీ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిసారి అల్లు అర్జున్ స్టైలిష్ లుక్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన పేరుకు తగ్గట్లుగా స్టైలిష్ స్టార్‌గా, ఐకానిక్ స్టార్‌గా తమ్ముడు శిరీష్ పెళ్లిల్లో అల్లు అర్జున్ వెలిగి పోతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం మనం చూశాం.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ...
కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాకుండా ఆయన ఫ్యామిలీ మొత్తం సోషల్ మీడియాలో చాలా స్పెషల్‌గా ట్రెండ్ కావడం మనం చూస్తూనే ఉంటాం. క్యూట్ అర్హతో పాటు స్నేహా రెడ్డి, అయాన్‌లు సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా శిరీష్ వివాహ వేడుకలో ఈ ఫ్యామిలీ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఫ్యామిలీ మొత్తం మ్యాచింగ్ ఔట్ ఫిట్ ను ధరించి ఐకాన్ ఫ్యామిలీ అన్నట్లుగా స్టైలిష్ సెల్ఫీ తీసుకున్న స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లు అయాన్, అర్హ లు పెద్ద వారు అవుతున్నారని, అయినా కూడా స్నేహా రెడ్డి, అల్లు అర్జున్ లు పెళ్లి సమయంలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో చాలా మంది తెగ కామెంట్స్ చేస్తూ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అల్లు స్నేహా రెడ్డి ఫోటోలు...
హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా స్నేహా రెడ్డి ఫోటోలు షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అందంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఏమాత్రం తగ్గకుండా స్నేహా రెడ్డి కన్నుల విందు చేస్తూ ఉంటుంది. ఇక చిన్నప్పటి నుంచే అర్హ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో అయన్ సైతం తెగ అల్లరి చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఇలా సోషల్ మీడియాలో ఈ ఫ్యామిలీ మొత్తానికి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఫ్యామిలీ మొత్తం ఇలా స్టైలిష్ ఐకానిక్ సెల్ఫీ తీసుకుంటే వైరల్ కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో అత్యధికంగా వ్యూస్ దక్కించుకుంటున్న ఫోటోగా నిలిచింది. స్నేహా రెడ్డి సింపుల్ ఔట్ ఫిట్‌తో పాటు, స్టైలిష్ లుక్ లో మరోసారి హీరోయిన్ రేంజ్ అందంతో ఆకట్టుకుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ - అట్లీ కాంబో మూవీ...
ఇక అల్లు అర్జున్ సినిమా విషయానికి వస్తే పుష్ప 2 సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని చేస్తున్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రూపొందుతున్న సినిమా కోసం పాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది. మొత్తం షూటింగ్‌ను ముంబైలో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా గురించి చిన్న అప్‌డేట్ కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీపికా పదుకునేతో పాటు పలువురు హీరోయిన్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ విషయంలో అట్లీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
