లవ్ మేటర్ రివీల్ చేసిన అల్లు శిరీష్..
ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు బ్యాచిలర్ లైఫ్ ను వీడుతున్నారు.
By: Madhu Reddy | 2 Nov 2025 8:53 AM ISTప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు బ్యాచిలర్ లైఫ్ ను వీడుతున్నారు. అందులో భాగంగానే నారా రోహిత్ 41 సంవత్సరాల వయసులో తాను ఇష్టపడిన శిరీష లెల్లాతో అక్టోబర్ 31న ఏడడుగులు వేయగా.. ఇప్పుడు మరో మెగా హీరో బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పేశారు. ఆయన ఎవరో కాదు టాలీవుడ్ హీరో అల్లు శిరీష్. త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన తాతయ్య దివంగత నటులు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు అల్లు శిరీష్.
అలా అక్టోబర్ 31వ తేదీన వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వేడుకకు చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్ తో పాటు పలువురు కుటుంబ సభ్యులు కలసి ఈ వేడుకను మరింత సక్సెస్ఫుల్ చేశారు. ఇదిలా ఉండగా నిశ్చితార్థం పూర్తయిన సందర్భంగా తన ప్రేమ ఎలా? ఎక్కడ మొదలైంది? అనే విషయాన్ని ఇన్స్టాలో పంచుకుంటూ అసలు విషయాన్ని తెలిపారు.
తన ప్రేమ వెనుక ఆ మెగా హీరో హస్తం ఉందని చెప్పిన అల్లు శిరీష్ భవిష్యత్తులో నా పిల్లలకు నా ప్రేమకథ గురించి చెబుతాను అంటూ కామెంట్లు చేశారు. అందులో భాగంగానే అల్లు శిరీష్ తన ఇన్స్టాలో లవ్ స్టోరీ గురించి చెబుతూ.. "2023లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ సమయంలో నితిన్ - శాలిని కందుకూరి ఇచ్చిన పార్టీలో నయనికను నేను కలుసుకున్నాను. అలా అక్కడ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సరిగ్గా రెండేళ్లకు ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. భవిష్యత్తులో నా పిల్లలు మా కథ ఎలా ప్రారంభమైందని అడిగితే ఇలానే మీ అమ్మను కలుసుకున్నాను అని చెబుతాను" అంటూ రాసుకువచ్చారు అల్లు శిరీష్. అంతేకాదు నితిన్ శాలినీ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ థాంక్యూ పెళ్లి పెద్ద అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. ఇక ప్రస్తుతం శిరీష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే నిశ్చితార్థం చేసుకున్నారు కానీ ఈ జంట వివాహ తేదీ ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికైతే అల్లు శిరీష్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్.. గీత ఆర్ట్స్ సంస్థ కో ప్రొడ్యూసర్ గా, సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్ గా ప్రసిద్ధి చెందారు. శిరీష్ కే.రాధమోహన్ దర్శకత్వం వహించిన గౌరవం అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు సరైన సక్సెస్ లభించలేదు. ఇక చివరిగా బడ్డీ అనే సినిమాలో హీరోగా నటించారు.
