ఘనంగా అల్లు శిరీష్ - నయనికల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. స్పెషల్ అట్రాక్షన్ గా బన్నీ!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా అడుగుపెట్టారు అల్లు శిరీష్. 2013లో 'గౌరవం' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు .
By: Madhu Reddy | 4 Feb 2026 2:10 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా అడుగుపెట్టారు అల్లు శిరీష్. 2013లో 'గౌరవం' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు . ఆ తర్వాత కొత్తజంట, శ్రీ రస్తు శుభమస్తు, ఒక్కక్షణం, ఊర్వశివో రాక్షసివో అంటూ పలు చిత్రాలు చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు అల్లు శిరీష్. ఇక చివరిగా 'బడ్డీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది కూడా పెద్దగా ఈయనకు గుర్తింపును అందించలేదు. ఇండస్ట్రీలోకి వచ్చి సెలబ్రిటీ కిడ్ గా కొనసాగుతున్నారు తప్పా .. తన సినిమాలతో ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా ఈయన తన ఖాతాలో వేసుకోకపోవడం గమనార్హం.
ఇకపోతే సినిమాల సంగతి కాస్త పక్కన పెడితే.. 38 సంవత్సరాల వయసొచ్చినా.. ఇంకా వివాహం చేసుకోకపోవడంతో అభిమానులు తెగ కామెంట్లు చేసేవారు. దీనికి తోడు ఊర్వశివో రాక్షసివో సినిమా సమయంలో ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన అను ఇమ్మానుయేల్ తో అల్లు శిరీష్ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు రాగా ఇవన్నీ రూమర్స్ గాని మిగిలిపోయాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఒక ఇంటి వారు కాబోతున్నారు అల్లు శిరీష్. తన స్నేహితురాలు, ప్రేయసి అయిన నయనికతో త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు శిరీష్. ఈ నేపథ్యంలోనే పెళ్లికి ముందే జరిగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ దుబాయ్ వేదికగా ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అల్లు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత స్నేహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. ఈ వేడుక దుబాయ్ లోని ప్రఖ్యాత జే 1 బీచ్ వేదికగా జరగడం విశేషం. సముద్రం అలల మధ్య లగ్జరీ బోట్ లో శిరీష్ - నయనిక తమ స్నేహితులతో కలిసి ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా ఈ వేడుకకు అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు అల్లు కుటుంబం మొత్తం హాజరైంది. ఇక వీరి అత్యంత సన్నిహితులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే వీటిని చూసిన అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వేడుకలలో అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం గమనార్హం.
తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో అల్లు శిరీష్ వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంటు ధరించగా.. అటు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మినీ ఫ్రాక్ ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేసింది నయానిక. ఇక్కడ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఫోటోలు చూసినా అభిమానులు పుష్ప గెటప్ లో కనిపించిన తీరు అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎల్లో కలర్ ప్రింటింగ్ షర్ట్స్ ధరించి, గాగుల్స్ పెట్టుకొని తన హెయిర్ స్టైల్ తో పుష్ప లుక్ ను తలపిస్తున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో బన్నీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడంతో ఈ ఫోటోలను బన్నీ అభిమానులు వైరల్ చేస్తున్నారు.
