శిరీష్ వెడ్స్ నయనిక.. గ్రాండ్ గా బ్యాచిలరేట్.. పిక్స్ చూశారా?
గ్రీన్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో నయనిక.. వైట్ అవుట్ ఫిట్ లో శిరీష్.. అందరినీ ఆకట్టుకున్నారు. అదే సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
By: M Prashanth | 2 Feb 2026 6:13 PM ISTఅల్లు కుటుంబంలో పెళ్లి సందడి షురూ! ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన ప్రేయసి నయనికను మార్చిలో పెళ్లి చేసుకోనున్న శిరీష్, దుబాయ్ లో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ బ్యాచిలర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
దుబాయ్ లోని ప్రముఖ జే1 బీచ్ వేదికగా శిరీష్- నయనిక ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. సముద్ర అలల నడుమ లగ్జరీ షిప్ లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులతో కలిసి కాబోయే భార్యభర్తలు ఫుల్ హ్యపీగా బ్యాచిలరేట్ జరుపుకున్నారు. ఆ పార్టీని పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బయటకు వచ్చిన వీడియోలు మాత్రం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
పార్టీలో శిరీష్ షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసి స్ప్రే చేయడం, అతిథులంతా చప్పట్లతో సరదాగా విష్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ క్షణాల్లో పక్కనే నిలబడ్డ అల్లు అర్జున్ నవ్వుతూ తమ్ముడి ఆనందాన్ని ఆస్వాదించిన దృశ్యాలు అభిమానులను అలరిస్తున్నాయి. శిరీష్, నయనిక ఇద్దరూ కలిసి షాంపైన్ షేర్ చేసుకుంటూ తమ సంతోషాన్ని పంచుకోవడం వీడియోల్లో కనిపిస్తోంది.
గ్రీన్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో నయనిక.. వైట్ అవుట్ ఫిట్ లో శిరీష్.. అందరినీ ఆకట్టుకున్నారు. అదే సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన షూటింగ్ షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని తమ్ముడి సెలబ్రేషన్స్ కు హాజరైన బన్నీ, కుటుంబంతో కలిసి ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశారు. స్టైలిష్ లుక్ లో మరోసారి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ప్రింటెడ్ సిల్క్ షర్ట్ లో ఆయన కనిపించగా, స్నేహారెడ్డి వైట్ డ్రెస్ లో ఎలిగెంట్ గా మెరిశారు.
ఇక పెళ్లి విషయానికి వస్తే, శిరీష్- నయనిక వివాహం 2026 మార్చి 6న జరగనుంది. ఆసక్తికరంగా అదే రోజు అల్లు అర్జున్- స్నేహారెడ్డిల మ్యారేజ్ యానివర్సరీ కూడా కావడం విశేషం. ఒకే రోజున ఇద్దరు సోదరుల జీవితాల్లో ప్రత్యేక సందర్భం రావడం అల్లు కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గతే ఏడాది అక్టోబర్ 31న శిరీష్ నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
దుబాయ్ లో ప్రీ వెడ్డింగ్ వేడుకలతో మొదలైన శిరీష్- నయనిక పెళ్లి సందడి.. మార్చిలో హైదరాబాద్ లో జరిగే గ్రాండ్ వెడ్డింగ్ తో ముగియనుంది. ఆ ఈవెంట్ కు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో శిరీష్- నయనిక వివాహం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి, దుబాయ్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు ఫ్యామిలీ హ్యాపీ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో కొత్త జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ అప్పుడే మొదలైంది.
