శిరీష్ ఎంగేజ్మెంట్.. బయటపడ్డ చరణ్, అర్జున్ బాండింగ్..!
అల్లు ఫ్యామిలీలో పెళ్లి సందడి మరోసారి అల్లు, మెగా ఫ్యామిలీలను ఒక చోట చేరేలా చేసింది.
By: Ramesh Boddu | 1 Nov 2025 1:14 PM ISTఅల్లు ఫ్యామిలీలో పెళ్లి సందడి మరోసారి అల్లు, మెగా ఫ్యామిలీలను ఒక చోట చేరేలా చేసింది. అల్లు అరవింద్ మూడో తనయుడు అల్లు శిరీష్ నైనికతో ఎంగేజ్ అయ్యాడు. ఈమధ్యనే దీపావళి టైం లో అల్లు ఫ్యామిలీ ఫోటోల్లో నైనైక కనిపించి సర్ ప్రైజ్ చేసింది. అప్పటి నుంచే అల్లు శిరీష్ పెళ్లి వార్తలు వైరల్ అవగా శుక్రవారం సాయంత్రం అల్లు శిరీష్, నైనికల ఎంగేజ్మెంట్ జరిగింది.
జీన్స్ షర్ట్, డెనిమ్ ఫాంట్ తో చిరు..
ఐతే ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా కూడా అటెండ్ అయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. అల్లు శిరీష్ నైనిక ఎంగేజ్మెంట్ కి చిరంజీవి డైరెక్ట్ గా షూటింగ్ స్పాట్ నుంచి రావడంతో స్టైలిష్ లుక్ తో చిరు అదరగొట్టారు. జీన్స్ షర్ట్, డెనిమ్ ఫాంట్ తో చిరు డాపర్ లుక్ ఈవెంట్ లోనే అందరికన్నా యంగ్ అండ్ స్టైలిష్ గా కనిపించారు.
ఇక చరణ్ అల్లు అర్జున్ కలిసి దిగిన ఫోటో ఫ్యాన్స్ కి కన్నుల పండగగా ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కూడా చాలా రేర్ గా కలుస్తారు. ఫ్యాన్స్ మధ్య ఫైట్ ఎలా ఉన్నా వీరిద్దరు కలిసినప్పుడు మాత్రం చాలా క్లోజ్ గా కనిపిస్తారు. ఐతే ఈమధ్య వీరిద్దరు కలిసి కనిపించిన సందర్భాలు రాలేదు.
స్పెషల్ గా అల్లు అర్జున్, చరణ్..
ఐతే అల్లు శిరీష్ నైనిక ఎంగేజ్మెంట్ లో స్పెషల్ గా అల్లు అర్జున్, చరణ్ కనిపించారు. వారి మధ్య ఉన్న బాండింగ్ ఏంటన్నది మరోసారి ఈ ఈవెంట్ తో తెలిసింది. చరణ్, అల్లు అర్జున్ కలిసి ఇలా ఫోటో దిగారో లేదో అలా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది.. అసలు మాటలే లేవు లాంటి గాసిప్పులకు ఒక్క ఫోటో.. ఒక్క ఈవెంట్ తో ఫుల్ స్టాప్ పెట్టారు ఈ ఇద్దరు.
నిజంగానే చరణ్, అల్లు అర్జున్ మధ్య సూపర్ బాండింగ్ ఉంది. అది ఈవెంట్ లో మరోసారి కనిపించింది. అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ లో చరణ్ సతీమణి ఉపాసనతో కలిసి పాల్గొన్నాడు. ఇక మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలను చిరంజీవి సతీమణి సురేఖ దగ్గర ఉండి అన్ని పనులు చూసుకున్నట్టు తెలుస్తుంది.
చిరంజీవి, చరణ్ మాత్రమే కాదు శిరీష్ ఎంగేజ్మెంట్ కి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కూడా అటెండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్ల ఆయన రావడం కుదరలేదని తెలుస్తుంది. ఇక శిరీష్ నైనిక ఎంగేజ్మెంట్ లో సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, లావణ్య ఇలా మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈవెంట్ లో సందడి చేశారు.
ఫ్యాన్ ఫీస్ట్ గా చరణ్, అల్లు అర్జున్..
చిరంజీవి క్రేజీ లుక్స్ తో ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారగా.. చరణ్, అల్లు అర్జున్ ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడం కూడా ఫ్యాన్ ఫీస్ట్ గా అనిపించింది. సో ఈ ఈవెంట్ తో చరణ్, అల్లు అర్జున్ మధ్య ఉన్న మంచి బాండింగ్ ఏంటో తెలిసింది. సో ఇక మీదట వీరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలు రాకపోవచ్చు.
అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ లో మిగతా సినీ ప్రముఖులు కూడా అటెండ్ అయ్యారు. ఎంగేజ్మెంట్ కాబట్టి కొద్దిమంది అతిథులతో కానిచ్చారు. ఐతే పెళ్లి వేడుకకు మాత్రం సినీ పరిశ్రమ మొత్తానికి ఆహ్వాన పత్రిక అందించేలా ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్.
