Begin typing your search above and press return to search.

వాలెంటైన్స్ డే సర్ప్రైజ్.. అల్లు శిరీష్ లవ్ స్టోరీ చూశారా!

ప్రేమికుల రోజున యంగ్ హీరో అల్లు శిరీష్ తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  M Prashanth   |   14 Feb 2026 4:15 PM IST
వాలెంటైన్స్ డే సర్ప్రైజ్.. అల్లు శిరీష్ లవ్ స్టోరీ చూశారా!
X

ప్రేమికుల రోజున యంగ్ హీరో అల్లు శిరీష్ తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "హ్యాపీ వాలెంటైన్స్ డే, క్యూటెస్ట్!" అంటూ శిరీష్ తన కాబోయే భార్య నయనిక రెడ్డికి స్పెషల్ విష్ చేయడంతో ఈ హడావుడి మొదలైంది. శిరీష్ షేర్ చేసిన వీడియోలో ఈ జంట మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా కనిపిస్తోంది.

పారిస్ వీధుల్లో చేతులు పట్టుకుని నడవడం, ఈఫిల్ టవర్ సాక్షిగా ఒకరినొకరు హత్తుకోవడం వంటి విజువల్స్ ఒక ప్యూర్ లవ్ స్టోరీని చూస్తున్న ఫీలింగ్ ఇస్తున్నాయి. కేవలం గ్లామర్ పర్సన్స్ లా కాకుండా, చాలా సింపుల్ గా, ఒకరికొకరు తోడుగా ఉన్నామనే భరోసా ఇచ్చేలా ఈ వీడియోను డిజైన్ చేశారు. ముఖ్యంగా ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ మరింత రీఫ్రెషింగ్‌గా ఉంది.

శిరీష్ తన ప్రేయసి నయనికతో స్వీట్ మూమెంట్స్ ని ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ పోస్ట్ ఇప్పుడు అల్లు ఇంట మొదలైన పెళ్లి సందడికి అధికారిక ముద్ర వేసింది. మార్చి 6న వీరిద్దరి వివాహం జరగనున్న తరుణంలో, ఈ వాలెంటైన్స్ డే పోస్ట్ అభిమానులకు ఒక స్వీట్ ట్రీట్‌లా అనిపిస్తోంది. వీడియో చివరలో దేవుడి ప్రణాళిక మన ప్లాన్ కంటే గొప్పది అని వేసిన క్యాప్షన్ వీరిద్దరి ప్రయాణం దైవికమైనదని చాటిచెబుతోంది.

వీడియోలో శిరీష్, నయనిక కలిసి ఉన్న ఫన్నీ మూమెంట్స్ కూడా హైలైట్‌గా నిలిచాయి. ఒకరి తల మీద ఒకరు సరదాగా చేయి వేసుకోవడం, ఫ్లైట్ లో జర్నీ చేస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం చూస్తుంటే వీరు ఎంతగా ఒకరినొకరు అర్థం చేసుకున్నారో క్లియర్ గా తెలుస్తోంది. కేవలం ఈవెంట్ల కోసమే కాదు, నిజ జీవితంలో కూడా వీరు చాలా క్లోజ్ గా ఉంటారని ఈ విజువల్స్ చెబుతున్నాయి. ఈ జంటను చూసి నెటిజన్లు "పర్ఫెక్ట్ మ్యాచ్" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన నయనిక రెడ్డితో శిరీష్ పరిచయం 2023లో ఒక వేడుకలో మొదలైంది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్తా ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు వచ్చింది.

ఇప్పటికే హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచుడు కార్యక్రమం కూడా పూర్తయింది. మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి శిరీష్‌ను ఆశీర్వదించడంతో మెగా అల్లు బంధం ఎంత స్ట్రాంగ్‌గా ఉందో మరోసారి ప్రూవ్ అయ్యింది. మార్చి 6న జరగబోయే ఈ పెళ్లికి టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. అదే రోజు అల్లు అర్జున్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా కావడం అల్లు ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అనే చెప్పాలి. శిరీష్ తన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతుంటే, నయనిక కూడా మెగా కోడలిగా పక్కా లోకల్ బ్యూటీలా అందరినీ ఆకట్టుకుంటోంది.