వినూత్న పద్ధతిలో పెళ్లి తేదీ ప్రకటించిన అల్లు శిరీష్.. వీడియో వైరల్!
తాజాగా వినూత్న పద్ధతిలో తన పెళ్లి తేదీని ప్రకటించారు అల్లు శిరీష్. తన అన్నయ్యల పిల్లలతో కలసి ఒక ఫన్నీ వీడియో చేస్తూ పెళ్లి తేదీని ఖరారు చేశారు.
By: Madhu Reddy | 29 Dec 2025 12:31 PM ISTఈ ఏడాది కొంతమంది సెలబ్రిటీలు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే.. మరి కొంతమంది తల్లిదండ్రులుగా తమ జీవితంలోకి కొత్త వారిని ఆహ్వానించి సంబరాలు చేసుకున్నారు. ఇంకొంతమంది నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది అక్టోబర్ 31న గత రెండు సంవత్సరాలుగా తాను ప్రేమిస్తున్న బడా వ్యాపారవేత్త కూతురు నయనికతో నిశ్చితార్థం చేసుకున్న అల్లు శిరీష్ ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయిపోయారు.
తాజాగా వినూత్న పద్ధతిలో తన పెళ్లి తేదీని ప్రకటించారు అల్లు శిరీష్. తన అన్నయ్యల పిల్లలతో కలసి ఒక ఫన్నీ వీడియో చేస్తూ పెళ్లి తేదీని ఖరారు చేశారు. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకున్నారు అల్లు శిరీష్. అందులో తన పెద్దన్నయ్య కూతురుతో పాటు అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్ , అల్లు అర్హలతో కలిసి ఈ వీడియో చేశారు. ట్రెండింగ్ సాంగ్ తో పిల్లలు పెళ్లెప్పుడు బాబాయ్ అని అడగగా మార్చి 6 2026 అని తెలిపారు. ఇక సంగీత్ ఎప్పుడు బాబాయ్ అని అడిగితే మనం సౌత్ ఇండియన్స్ కదా అలాంటివి మనం చేయడం లేదు అంటూ తెలిపారు. మొత్తానికైతే 2026 మార్చి 6న తన భాగస్వామితో ఏడు అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నానని వీడియోతో సహా వినూత్న పద్ధతిలో అనౌన్స్మెంట్ చేశారు అల్లు శిరీష్.
ఇకపోతే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తన అన్నయ్య అల్లు అర్జున్ పెళ్లిరోజు నాడే తన పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా పేరు సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. స్నేహారెడ్డిని 2011 మార్చి 6వ తేదీన వివాహం చేసుకున్నారు. అంటే దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ అదే రోజున అల్లు శిరీష్ కూడా ఒక ఇంటివాడు కాబోతున్నాడు అని తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తన అన్నయ్య పెళ్లి రోజునే తన పెళ్లి కూడా జరుపుకోబోతున్నారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక అల్లు శిరీష్ విషయానికి వస్తే గౌరవం సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈయన.. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మంచి విజయం అందుకున్నారు. 2022లో అను ఇమ్మాన్యూయేల్ తో కలిసి ఊర్వశివో రాక్షసివో అనే సినిమా చేశారు ఈ సినిమా సమయంలోనే అను ఇమ్మాన్యూయేల్ తో ప్రేమలో ఉన్నాడని, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి. 2024లో చివరిగా బడ్డీ అనే సినిమాలో నటించారు. ఇక ఇప్పుడు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు.
