Begin typing your search above and press return to search.

వీడియో: అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియల్లో పాడే మోసిన హీరోలు

లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ (94) శనివారం తెల్లవారుజామున వృధాప్య కారణాలతో కన్నుమూశారు.

By:  M Prashanth   |   30 Aug 2025 4:41 PM IST
వీడియో: అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియల్లో పాడే మోసిన హీరోలు
X

లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ (94) శనివారం తెల్లవారుజామున వృధాప్య కారణాలతో కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన క్షణం నుంచి మెగా, అల్లు కుటుంబ సభ్యులు అంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులు సంతాప సందేశాలు తెలియజేశారు.

అల్లు అరవింద్ నివాసానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు చేరుకొని ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత కోకపేటలో జరిగిన అంత్యక్రియల్లో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అయాన్ పాల్గొన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి పాడె మోసి, కన్నీటి వీడ్కోలు పలికారు. అలాగే అల్లు అర్జున్ తనయుడు అయాన్ కూడా తండ్రి సపోర్ట్ తో పాడే మేస్తూ కనిపించాడు.

ఈ సందర్భంలో అక్కడ ఉన్నవారంతా భావోద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి, అరవింద్, బన్నీ, చరణ్ కలిసి కనకరత్నమ్మకు తుదిశ్రద్ధలు అర్పించడం చూసి అక్కడున్నవారందరూ కదిలిపోయారు. తరం మారినా కుటుంబ బంధం ఎంత గాఢంగా ఉంటుందో ఈ సందర్భంలో మరొకసారి తేటతెల్లమైంది. మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఉన్న ఈ క్షణాలను అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించని చరణ్, బన్నీ ఈ సందర్భంలో కలిసి నిలబడి కుటుంబ బలాన్ని చూపించారు. అంత్యక్రియల ఏర్పాట్లను స్వయంగా అల్లు అరవింద్, చిరంజీవి పర్యవేక్షించారు. మధ్యాహ్నం జరిగిన తుదిశ్రద్ధల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా అందరూ కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.