Begin typing your search above and press return to search.

ఆ హీరోకి ఇప్ప‌టికీ బుజ్జి త‌మ్ముడే!

తాజాగా శిరీష్ ని బ‌న్నీ ఎలా పిలిచేవారో వెలుగులోకి వ‌చ్చింది. శిరీష్ చిన్న‌గా ఉన్నస‌మ‌యంలో బుజ్జి త‌మ్ముడు అని ఎంతో ప్రేమ‌గా పిలుస్తాన‌న్నారు.

By:  Srikanth Kontham   |   9 Nov 2025 9:00 PM IST
ఆ హీరోకి ఇప్ప‌టికీ బుజ్జి త‌మ్ముడే!
X

బాల్యంలో పిలుపులు ఎంతో ముద్దుగా ఉంటాయి. పెరిగి పెద్ద అయ్యే కొద్ది ఆ పిలుపులు దూర‌మ‌వుతుంటాయి. కుటుంబంలో కొత్త స‌భ్యులు యాడ్ అయ్యే కొద్ది వ్య‌త్యాసాలు పెరుగుతుంటాయి. భ‌ర్త‌, భార్య‌, పిల్ల‌లు అంటూ కొత్త బంధాలు ఏర్ప‌డుతుంటాయి. దీంతో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య దూరం కూడా పెర‌గ‌డం స‌హ‌జ‌మే. దీంతో ఇంట్లో చిన్న వాళ్లు కొన్ని ర‌కాల ఆప్యాయ‌త‌ల‌కు దూర‌మ‌వుతుంటారు. చిరంజీవికి త‌మ్ముళ్లు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో ఇద్ద‌రు చిన్న వారు కావ‌డంతో? చిరంజీవి వారిద్ద‌ర్ని ఎంతో ప్రేమ‌గా చూస్తారు.

అన్న‌య్య‌లు అంటే త‌మ్ముళ్లు అంతే విధేయ‌త‌తో ఉంటారు. చిన్న‌ప్పుడు వారిపై చూపించే ప్రేమ‌ని ఇప్పుడు వాళ్ల త‌న‌యుల‌పై చూపిస్తుంటారు. వ‌రుణ్ తేజ్ ని చిరంజీవి ఇప్ప‌టికీ ఎంతో ముద్దు చేస్తుంటారు. తాజాగా అల్లు ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుంద‌న్న‌ది తెలిసింది. బ‌న్నీకి ..శిరీష్ అంటే ఎంత ఇష్ట‌మో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంట్లో అంద‌రికంటే చిన్న వాడు కావ‌డంతో? ఇప్ప‌టికీ ఎంతో ప్రేమిస్తాడు. త‌న‌లా త‌మ్ముడు కూడా పెద్ద స్టార్ అవ్వాల‌ని ఎంతో ఆశ ప‌డ్డాడు. కానీ ఆ కోరిక ఇంకా నెర‌వేర‌లేదు. శిరీష్ విష‌యంలో బ‌న్నీకి అదో అసంతృప్తి అని చాలా సంద‌ర్భాల్లో బ‌న్నీ ఓపెన్ అయ్యాడు.

తాజాగా శిరీష్ ని బ‌న్నీ ఎలా పిలిచేవారో వెలుగులోకి వ‌చ్చింది. శిరీష్ చిన్న‌గా ఉన్నస‌మ‌యంలో బుజ్జి త‌మ్ముడు అని ఎంతో ప్రేమ‌గా పిలుస్తాన‌న్నారు. శిరీష్ అంటే త‌న‌కు ఇప్ప‌టికీ అదే ఇష్ట‌మ‌ని..పెరిగి పెద్ద వాడు అయినా? ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ అంతే సాలిడ్ గా ఉంద‌న్నాడు. ఇప్ప‌టికీ త‌న‌ని బుజ్జి త‌మ్ముడు అనే ఇంట్లో పిలుస్తాన‌న్నారు.

తెలుగు లోగిళ్ల‌లో ఇలాంటి పిలులుపు ఎంతో ఆప్యాయ‌త‌ను తెలియ‌జేస్తుంటాయి. త‌మ‌కంటే చిన్న వారిని చిన్నా, బిజ్జి, బుజ్జోడు అంటూ సంబోధిస్తుంటారు.` దంగ‌ల్` సినిమాలో సీన్ లో అమీర్ఖాన్ ని కూడా ఓ బాలుడిని ఇలా రారా? బుజ్జోడా? అంటూ పిలుస్తాడు. అప్ప‌ట్లో ఆ సంభాష‌ణ తెలుగు ఆడియ‌న్స్ కి ఎంతో క‌నెక్ట్ అయింది.

ఇక అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న సంగ‌తి తెలిసిందే. నయనికతో కలిసి ఏడడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలో ఇరువురి నిశ్చితార్థం ఇటీవ‌ల జరిగింది. చాలా కాలంగా పెళ్లి చేసుకోవాల‌ని ఇంట్లో ఒత్తిడి చేస్తున్నా? ఇంత‌కాలం స్కిప్ కొట్టుకుంటూ వ‌చ్చాడు. తుదిగా వివాహ గ‌డియ‌లు రావ‌డంతో ధాంప‌త్య జీవితంలోకి రెడీ అవుతున్నాడు. న‌టుడిగా చివ‌రిగా `బ‌డ్డీ` సినిమాతో గ‌త ఏడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.