Begin typing your search above and press return to search.

అల్లు సినిమాస్ వినోదానికి డెస్టినేష‌న్ కానుందా?

ఈ మ‌ల్టీప్లెక్స్ అనుభ‌వం అద్భుతంగా ఉంద‌ని, వీక్ష‌కుల‌ ఎంట్రీని కూడా రెడ్ కార్పెట్ త‌ర‌హాలో విభిన్నంగా ప్లాన్ చేశార‌ని, ఈ ఎక్స్‌పీరియ‌న్స్ అద్భుతం అని రీల్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

By:  Ravindar Gorantla   |   16 March 2026 1:00 PM IST
అల్లు సినిమాస్ వినోదానికి డెస్టినేష‌న్ కానుందా?
X

కోకాపేట‌లోని అత్యంత ఖ‌రీదైన ప్ర‌దేశంలో భారీ ఖ‌ర్చుతో స‌క‌ల సౌక‌ర్యాల‌తో ఏర్పాటు చేసిన అల్లు సినిమాస్ మ‌ల్టీప్లెక్స్ న‌గ‌ర వాసుల‌కు వినోదానికి ప్ర‌ధాన డెస్టినేష‌న్‌గా మార‌నుందా? అంటే థియేట‌ర్‌లోని హంగులు, స‌క‌ల సౌక‌ర్య‌లు, థియేట‌ర్‌లోని హంగులు చూసిన వారంతా అవున‌నే చెబుతున్నారు. ఇటీవ‌లే గ్రాండ్‌గా ప్రారంభించ‌బ‌డిన అల్లు సినిమాస్ సంద‌ర్శ‌కుల కోసం వెల్క‌మ్ చెబుతోంది. ఈ మ‌ల్టీప్లెక్స్ అనుభ‌వం అద్భుతంగా ఉంద‌ని, వీక్ష‌కుల‌ ఎంట్రీని కూడా రెడ్ కార్పెట్ త‌ర‌హాలో విభిన్నంగా ప్లాన్ చేశార‌ని, ఈ ఎక్స్‌పీరియ‌న్స్ అద్భుతం అని రీల్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

డాల్బీ స్క్రీన్‌లో 75 అడుగుల ఫ్లాట్ స్క్రీన్ ఉంది. ఆ అనుభ‌వం ఆడియ‌న్స్‌ని అబ్బుర‌పరుస్తూ స‌రికొత్త ఫీల్‌ని క‌లిగిస్తోంది. సీటింగ్‌, ఇంటీరియ‌న్ ప్ర‌తీదీ ప్రీమియంగా ఉండి హైద‌రాబాద్‌లోని థియేట‌ర్ల‌లోనే అల్లు సినిమాస్ అద‌త్యుత్త‌మ‌మైన ఎక్స్‌పీరియ‌న్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింద‌ని అంతా అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ మ‌ల్టీప్లెక్స్ సంద‌ర్శ‌కుల‌తో నిండిపోయి హౌస్ ఫుల్ బోర్డ్స్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ థియేట‌ర్‌లో ప్ర‌ధానంగా ఆక‌ర్షించింది 75 అడుగుల ఫ్లాట్ స్క్రీన్, డాల్బీ సౌండ్ సిస్ట‌మ్. ఆ త‌రువాత కార్ పార్కింగ్‌.

హైద‌రాబాద్‌లోని మ‌ల్టీప్లెక్స్‌ల‌లో కార్ పార్కింగ్ ఓ ప‌ద్మ‌శ్యూహంలా ఉంటుంది. ఎక్క‌డ పార్క్ చేశామో తెలియ‌దు. ముఖ్యంగా పార్క్ చేసే చోటున్న పిల్ల‌ర్ నంబ‌ర్ గుర్తుపెట్టుకోవాల్సిందే. కానీ అల్లు సినిమాస్‌లో అలా కాదు. అంతా ఓపెన్ పార్కింగ్‌. ఒకేసారి 500 కార్లు పార్క్ చేయ‌గ‌ల సామ‌ర్ధ్యం ఉన్న స్థాలాన్ని కార్ పార్కింగ్ కోసం కేటాయించ‌డం అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం తెలుగు సినిమాలేవీ రిలీజ్ కాక‌పోవ‌డంతో అల్లు సినిమాస్‌లో ప్ర‌స్తుతం హాలీవుడ్ మూవీస్ ఎఫ్ 1, అవ‌తార్‌, సూప‌ర్‌మ్యాన్ సినిమాల‌ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఇవి పాత‌వే అయినా వీటి కోసం కాపోయినా మ‌ల్టీప్లెక్స్‌ని వీక్షించ‌డానికి ఆడియ‌న్స్, సినీ ల‌వ‌ర్స్ భారీ స్థాయిలో కోకోపేట‌లోని ఈ మ‌ల్టీప్లెక్స్‌కి భారీ సంఖ్య‌లో వెలుతుండ‌టంతో అల్లు సినిమాలు ప్రాంగ‌ణం అంతా ప్రేక్ష‌కుల హ‌డావిడితో కోలాహ‌లంగా మారిపోతోంది. శుక్ర‌వారం నుంచి డాల్బీ స్క్రీన్ ని సంద‌ర్శ‌కుల కోసం ఓపెన్ చేశారు. ఈ తాకిడి చూస్తుంటే వీకెండ్స్ అల్లు సినిమాస్ అంత‌టా హౌస్ ఫుల్ బోర్డ్స్ ద‌ర్శ‌న‌మివ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ టెక్నాల‌జీతో దీన్ని రూపోందించారు. ఇమేజ్ క్లారిటీ, సూప‌ర్ షార్ప్‌నెస్‌, సౌండ్ క్లారిటీ అద్భుతంగా ఉండి ఆడియ‌న్‌కు అత్యుత్త‌మ సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది.

డాల్బీ స్క్రీన్‌లో డైరెక్ట‌ర్స్ రిక్లైన‌ర్ సీట్స్ ఉన్నాయి. వీటిని థియేట‌ర్ మ‌ధ్య‌లో ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్ మ‌ల్టీప్లెక్స్‌ల‌లో లేని అత్యుత్త‌మ సీట్లు. ఎంట్రీ నుంచి ఆడియ‌న్స్‌కు స‌రికొత్త ఫీల్‌ని క‌లిగిస్తున్న అల్లు సినిమాస్‌లోని ఫోర్త్‌ స్క్రీన్ ఇంకా ఓపెన్ చేయ‌లేదు. త్వ‌ర‌లోనే దాన్ని కూడా ఓపెన్ చేయ‌బోతున్నారు. మార్చి 19 నుంచి ధురంధ‌ర్ 2, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో అల్లు సినిమాస్ ప్రేక్ష‌కుల కోలాహ‌లంతో కిక్కిరిసిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ థియేట‌ర్‌లోని సౌక‌ర్యాలు గ‌మ‌నిస్తే న‌గ‌ర వాసుల‌కు వీకెండ్ వినోదానికి అల్లు సినిమాస్ డెస్టినేష‌న్‌గా మార‌డం ఖాయం.