Begin typing your search above and press return to search.

ట్రెండింగ్ లో 'అయాన్'.. ఎక్కడ చూసినా ఆ పోస్టులే..

అందుకే అభిమానులు ప్రేమగా అతడిని మోడల్ అయాన్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. తాజాగా అల్లు ఫ్యామిలీ వేడుకలో అయాన్ చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  M Prashanth   |   3 March 2026 12:59 PM IST
ట్రెండింగ్ లో అయాన్.. ఎక్కడ చూసినా ఆ పోస్టులే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ లో నిలిచాడు. స్టార్ హీరోల పిల్లల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అయాన్.. తన అల్లరి పనులతో నెటిజన్లను, బన్నీ ఫ్యాన్స్ ను ఎప్పుడూ ఆకట్టుకుంటుంటాడు. ఎక్కడ కనిపించినా ఏదో ఒక సరదా పని, ఫన్నీ ఎక్స్ప్రెషన్ లేదా స్టైలిష్ పోజ్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటాడు.

అందుకే అభిమానులు ప్రేమగా అతడిని మోడల్ అయాన్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. తాజాగా అల్లు ఫ్యామిలీ వేడుకలో అయాన్ చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యంగ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌ లో అయాన్ స్పెషల్ అట్రాక్షన్‌ గా నిలిచాడు. ఆ ఈవెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరి దృష్టి అతనిపైనే నిలిచింది.

స్టైలిష్ లుక్‌ లో కనిపించిన అయాన్, గాగుల్స్ పెట్టుకుని, కొత్త హెయిర్ స్టైల్‌ తో ఫోటోలకు పోజులు ఇస్తూ ఆకట్టుకున్నాడు. అల్లు అర్జున్ తీసుకున్న సెల్ఫీలో అయాన్ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ప్రత్యేకంగా కనిపించాయి. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసిన అభిమానులు రెడీ టు రూల్, మోడల్ అయాన్ మళ్లీ వచ్చేశాడు, నెక్స్ట్ జనరేషన్ స్టార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇన్‌ స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అయాన్ రీల్స్ మాత్రమే కనిపిస్తున్నాయంటూ నెటిజన్లు చెబుతున్నారు. ఇతర స్టార్ హీరోల పిల్లల కంటే అయాన్‌ కు ఉన్న క్రేజ్ స్పెషల్ అని అభిమానులు అంటున్నారు. ఇక శిరీష్ పెళ్లి విషయానికి వస్తే, అల్లు వారబ్బాయి తన ప్రేయసి నయనికతో ఈ నెల 6న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. దీంతో నిన్న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు.

అల్లు స్టూడియోస్ లో జరిగిన ఆ వేడుకలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు ఇలా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా అక్కినేని, నందమూరి, మెగా కుటుంబాలకు చెందిన సభ్యులు హాజరై వేడుకలకు మరింత స్పెషాలిటీ తీసుకొచ్చారు.

ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అందరి దృష్టి ఎక్కువగా ఆకర్షించింది మాత్రం అయాన్ చేసిన అల్లరే. స్టేజ్‌ పై నడుస్తూ, కెమెరాలకు పోజులు ఇస్తూ, అందరితో కలిసిపోయిన అతని యాక్టివ్ నెస్ అభిమానులను ఆకట్టుకుంది. మొత్తానికి చిన్న వయసులోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అయాన్ ఫ్యూచర్ లో ఏ రేంజ్ కు చేరుకుంటాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం మోడల్ అయాన్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాడు.