Begin typing your search above and press return to search.

డియర్ 'రష్' అంటూ బన్నీ పోస్ట్.. ఏంటి మ్యాటర్?

తమ కెరీర్స్ లో బిగ్గెస్ట్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు. సినిమాల్లో తమ యాక్టింగ్ తో పాన్ ఇండియా రేంజ్ లో అందరినీ మెప్పించారు.

By:  M Prashanth   |   12 Aug 2025 4:43 PM IST
డియర్ రష్ అంటూ బన్నీ పోస్ట్.. ఏంటి మ్యాటర్?
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇద్దరూ కలిసి పుష్ప-1,2లో యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. తమ కెరీర్స్ లో బిగ్గెస్ట్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు. సినిమాల్లో తమ యాక్టింగ్ తో పాన్ ఇండియా రేంజ్ లో అందరినీ మెప్పించారు.


ఇప్పుడు ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తున్నారు. అదే సమయంలో రష్మిక మందన్న మాత్రం ఇప్పుడు అనేక మూవీల్లో యాక్ట్ చేస్తోంది. అటు నార్త్ టు సౌత్.. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న అమ్మడు.. థియేటర్స్ లో సందడి చేస్తూనే ఉంది.

అయితే రీసెంట్ గా రష్మిక పెర్ఫ్యూమ్ బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. డియర్ డైరీ పేరుతో వ్యాపారాన్ని మొదలుపెట్టిన ఆమె.. నాలుగు ఫ్లేవర్స్ ను ఇప్పటికే ఇంట్రడ్యూస్ చేసింది. 100ml,10ml లో ఉన్న పెర్ఫ్యూమ్స్ ఆన్ లైన్ లో కూడా లభిస్తున్నాయి. వాటిని రష్మిక ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలందరికీ స్పెషల్ గిఫ్ట్ రూపంలో పంపిస్తోంది.

తన పెర్ఫ్యూమ్ బిజినెస్ ప్రమోషన్స్ లో భాగంగా అన్ని ఫ్లేవర్స్ పెర్ఫ్యూమ్స్ ను సెట్ రూపంలో సెండ్ చేస్తుండగా.. వాటిని అందుకున్న సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పిక్స్ షేర్ చేసి రష్మికకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే పోస్ట్ పెట్టారు. డియర్ రష్ అంటూ రాసుకొచ్చారు.

డియర్ డైరీ పెర్ఫ్యూమ్స్ ఫోటోను ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన బన్నీ.. థ్యాంక్యూ సో మచ్ మై డియర్ రష్.. నీ కొత్త జర్నీకి ఆల్ ది బెస్ట్.. నీకు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటాన్నానంటూ అంటూ తెలిపారు. అయితే బన్నీ పెట్టిన పోస్ట్ కు రష్మిక రిప్లై ఇస్తూ థ్యాంక్యూ చెప్పారు. ఇప్పుడు బన్నీ, రష్మిక ఇన్ స్టా స్టోరీలు నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా.. పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్‌ సినిమాల తర్వాత అల్లు అర్జున్, రష్మిక మరోసారి సిల్వర్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారనే ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలసిందే. అట్లీ- బన్నీ మూవీలో కథ రీత్యా ఐదుగురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని సమాచారం. అందులో రష్మిక ఒకరని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో..