Begin typing your search above and press return to search.

బన్నీ కొత్త లుక్.. నెట్టింట మొదలైన క్రేజీ డిబేట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒక రేంజ్ లో చర్చ నడుస్తూనే ఉంటుంది.

By:  M Prashanth   |   21 Feb 2026 3:02 PM IST
బన్నీ కొత్త లుక్.. నెట్టింట మొదలైన క్రేజీ డిబేట్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒక రేంజ్ లో చర్చ నడుస్తూనే ఉంటుంది. తన ఏ చిన్న ఈవెంట్ లో కనిపించినా ఆ ఫోటోలు నిమిషాల్లో వైరల్ అయిపోతాయి. అల్లు శిరీష్ పెళ్లి పనులతో అల్లు వారి ఇల్లు కళకళలాడుతున్న తరుణంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడి కోసం ఒక గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీని హోస్ట్ చేశారు. ఈ వేడుకలో బన్నీ చాలా డిఫరెంట్ అప్పియరెన్స్ తో కనిపించారు.

అయితే ఈసారి కేవలం స్టైల్ మాత్రమే కాకుండా, ఒక పిక్ విషయంలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి మాట్లాడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పిక్ లో అల్లు అర్జున్ ఒక చేతిలో గ్లాస్, మరో చేతిలో సిగార్ పట్టుకుని ఉన్న ఆటిట్యూడ్ ఇప్పుడు ట్రోల్స్ కి దారితీస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక వర్గం వారు ఈ ఫోటోపై నెగిటివ్ గా స్పందిస్తున్నారు. గతంలో బన్నీ తనకు ఆల్కహాల్ అలవాటు లేదని చెప్పిన విషయాలను కొందరు ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఇలాంటి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ పిక్ తో కనిపించడంతో నెట్టింట భిన్నంగా స్పందిస్తున్నారు.

అయితే దీనిపై బన్నీ ఫ్యాన్స్ మరోలా రియాక్ట్ అవుతున్నారు. ఆ గ్లాసులో ఉన్నది ఆల్కహాల్ కాకపోవచ్చని, అది కేవలం ఒక సాఫ్ట్ డ్రింక్ లేదా జ్యూస్ అయ్యే ఛాన్స్ ఉందని గట్టిగా వాదిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక లీక్డ్ పిక్ ని పట్టుకుని ఇంతలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని, అది కేవలం ఒక పార్టీ మూడ్ లో తీసిన ఫోటో మాత్రమేనని మద్దతు తెలుపుతున్నారు. గ్లాసులో ఉన్నది ఏంటో తెలియకుండా నెగిటివ్ కామెంట్స్ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ లోని ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ఇలాంటి గందరగోళం కలగడం సహజం. బన్నీని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ పోస్టులు ఇప్పుడు ఎక్కడ చూసినా హల్చల్ చేస్తున్నాయి. పుష్ప లాంటి సినిమాల ద్వారా మాస్ ఇమేజ్ ఉన్న బన్నీ, ఇలాంటి బోల్డ్ లుక్ లో కనిపించడం కొందరికి నచ్చగా, మరికొందరిని మాత్రం నిరాశపరిచింది. ఇలాంటి విభిన్నమైన అభిప్రాయాలతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట ఒక పెద్ద వార్ కి దారితీసింది.

ఈ వివాదం పక్కన పెడితే, బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాబోయే భారీ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం చేస్తున్న మేకోవర్ లో భాగంగానే ఇలాంటి లుక్స్ ట్రై చేస్తున్నారేమో అన్న చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా ఒక చిన్న లీక్డ్ పిక్ కూడా ఇంతలా వైరల్ అవుతుందంటే, బాక్సాఫీస్ దగ్గర బన్నీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసే సోషల్ మీడియా బ్యాచ్ కి ఇదొక మంచి కంటెంట్ దొరికినట్లయింది.

ఏదేమైనా అల్లు అర్జున్ టీమ్ ఈ ట్రోల్స్ పై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ఆ గ్లాసులో ఉన్నది ఏంటనేది పెద్ద సస్పెన్స్. తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి వేడుకల హడావిడిలో ఉన్న బన్నీ, ఇలాంటి సోషల్ మీడియా వార్స్ ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. మరి ఆయనకు సంబంధించిన వారు ఎవరైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.