నా మైండ్ లోకి రాని క్యారెక్టర్ అదొక్కటే
ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ నానుడి సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది.
By: Sravani Lakshmi Srungarapu | 4 Sept 2025 3:39 PM ISTఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ నానుడి సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం, ఒకరు మొదలుపెట్టిన సినిమాల్ని ఇంకొకరు పూర్తి చేయడం.. ఇలా ఇండస్ట్రీలో చాలానే జరుగుతూ ఉంటాయి. అయితే ఏ డైరెక్టర్ అయినా కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ జరగాలంటే ముఖ్యంగా కావాల్సింది కథనే. అందుకే కథ రాసుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలా కథ రాసుకునే టైమ్ లోనే అందులోని పాత్రలకు ఫలానా వాళ్లైతే బావుంటారనుకుని కొందరు రాసుకుంటారు. మరికొందరు డైరెక్టర్లైతే కథ, దానిలోని పాత్రలు రాసుకున్న తర్వాత ఆ పాత్రకు ఎవరైతే బావుంటారా అని ఆలోచించి వారిని సంప్రదిస్తూ ఉంటారు.
బన్నీతో వేదం..
ఇందులో డైరెక్టర్ క్రిష్ మొదటి రకం. తాను ఏ సినిమా కథ రాసుకున్నా, కథ రాసుకున్నప్పుడే మైండ్ లోకి యాక్టర్లు వచ్చేస్తారని, ఇప్పటివరకు అన్నీ అంతే జరిగాయని, కానీ అలా మైండ్ లోకి రాని ఒకే ఒక క్యారెక్టర్ అల్లు అర్జున్ అని చెప్పారు క్రిష్. అల్లు అర్జున్, క్రిష్ కలయికలో గతంలో వేదం అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో బన్నీ క్యారెక్టర్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
అల్లు అర్జున్ వల్లే ఆ సినిమాకు అంత రీచ్ వచ్చింది
వేదం కథ విన్నాక అల్లు అర్జునే ఈ సినిమా తాను చేస్తానని అన్నారని, కేబుల్ రాజు క్యారెక్టర్ ను తాను చేస్తానని చెప్పిన తర్వాత మళ్లీ కథను కొంచెం మార్చి అల్లు అర్జున్ కోసం కథను రాశానని, వేదం సినిమాకు అంత రీచ్ రావడంలో ఎక్కువ క్రెడిట్ బన్నీదేనని, ఆ తర్వాత ఆర్కా మీడియా వాళ్లు ఆ కథను నమ్మడం వల్లే వేదం సినిమా తీయగలిగానని క్రిష్ చెప్పారు.
అనుష్కతో రెండోసారి
కాగా క్రిష్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క తో ఘాటీ సినిమా చేసి దాన్ని రిలీజ్ కు రెడీ చేశారు. సెప్టెంబర్ 5న ఘాటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్క ప్రమోషన్స్ కు హాజరవకపోవడంతో ఆ భారమంతా చిత్ర యూనిట్ పైనే పడింది. దీంతో క్రిష్ ఘాటీ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ సినిమా గురించి ప్రమోట్ చేయడంతో పాటూ తన పాత సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా వెల్లడిస్తున్నారు.
