Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో విడుదల!

అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ అట్లీ కలయికలో వస్తున్న ఈ సినిమా ఒక భాగంగా వస్తుందా లేక రెండు భాగాలుగా వస్తుందా అనేది తెరపై సాగుతున్న చర్చ.

By:  Madhu Reddy   |   21 Dec 2025 1:53 PM IST
ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో విడుదల!
X

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్.. ఆ తర్వాత పుష్ప 2 సినిమాతో మరో ఫీట్ అందుకున్నారు. అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాలలో రెండవ స్థానాన్ని దక్కించుకొని తెలుగు సినిమాకి ఊహించని స్థాయిని అందించారు అని చెప్పవచ్చు. అలాంటి ఈయన ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ చిత్రాన్ని చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అటు అవతార్ తో పాటు హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ కంపెనీల చేత ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ అందిస్తున్నారు.

ఇందులో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఇందులో భాగమవుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పుష్ప, పుష్ప2 చిత్రాలలో శ్రీవల్లి క్యారెక్టర్ తో అందరినీ అబ్బురపరిచిన రష్మిక మందన్న ఈసారి అల్లు అర్జున్ తో పోటీ పడడానికి సిద్ధమవుతోందని, విలన్ క్యారెక్టర్ పోషిస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ దీనిపై స్పష్టత లేదు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా 2027లో విడుదల అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలలో వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది . అదేమిటంటే సినిమాను త్వరగా రిలీజ్ చేయాలని అట్లీ భావిస్తున్నట్లు సమాచారం.

అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ అట్లీ కలయికలో వస్తున్న ఈ సినిమా ఒక భాగంగా వస్తుందా లేక రెండు భాగాలుగా వస్తుందా అనేది తెరపై సాగుతున్న చర్చ. అయితే ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డైరెక్టర్ అట్లీ నిర్ణయించుకున్నారట. అందుకే తొలి భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని అందులో భాగంగానే మొదటి భాగాన్ని త్వరగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిజంగానే భావిస్తున్నట్లయితే గనుక అభిమానులకు ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా విడుదలే కాలేదు అప్పుడే అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టును ఏ డైరెక్టర్ తో చేయబోతున్నారు అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా అట్లీ సినిమాను త్వరగా విడుదల చేయబోతున్నారు కాబట్టే అల్లు అర్జున్ ఈమధ్య పలువురు దర్శకులతో కథా చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు , తమిళ్, మలయాళం ఇలా మూడు భాషలకు చెందిన దర్శకులతో ఆయన కథా చర్చలు చేస్తున్నారని.. ఈ మూడు భాషలలో ఏదో ఒక దర్శకుడు పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టును ఏ భాష ఇండస్ట్రీకి చెందిన దర్శకుడికి అవకాశం ఇస్తారో చూడాలి.