Begin typing your search above and press return to search.

ఏడాదిలో రెండు ప్లాన్‌ చేస్తున్న అల్లు అర్జున్‌

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’కు వీఎఫ్‌ఎక్స్ పనుల కోసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉండటంతో అల్లు అర్జున్ మరో సినిమాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు టాక్. ‘గ్యాంగ్‌స్టర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాలు తక్కువ గ్యాప్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

By:  Ramesh Palla   |   16 Nov 2026 8:00 PM IST
ఏడాదిలో రెండు ప్లాన్‌ చేస్తున్న అల్లు అర్జున్‌
X

అల్లు అర్జున్ ‘పుష్ప’ ప్రాంచైజీ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో, ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ పై సరికొత్త ప్రయోగం అన్నట్లుగా అట్లీ దర్శకత్వంలో 'రాకా' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. బన్నీతో అట్లీ చాలా పెద్ద ప్రయోగమే చేస్తున్నాడని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. అయితే ఆ ప్రయోగం ఏంటి అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిందంటూ ఆ మద్య ఒక చిట్‌ చాట్‌లో అట్లీ చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్‌ పూర్తి చేసినా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ కి కచ్చితంగా ఏడాది సమయం పడుతుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. అదే జరిగితే రాకా సినిమా రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్‌ ఒక సినిమాను చేయాలని భావిస్తున్నాడు. రాకా విడుదల అయ్యే వరకు ఊరికే ఉండడం ఎందుకు అనే ఉద్దేశంతో బన్నీ కొత్త సినిమాను ప్రారంభించేందుకు రెడీ అయ్యాడని సమాచారం అందుతోంది.

అల్లు అర్జున్‌, లోకేష్ కనగరాజ్‌ కాంబో మూవీ...

చాలా కాలంగా అల్లు అర్జున్‌, లోకేష్ కనగరాజ్‌ కాంబోలో మూవీ గురించి వార్తలు వస్తున్నాయి. వీరి కాంబో మూవీ క్యాన్సల్‌ అయిందనే వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా మైత్రి మూవీ మేకర్స్ వారు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటి వరకు బన్నీ తీసుకున్న పారితోషికాలతో పోల్చితే లోకేష్ కనగరాజ్‌ మూవీకి మైత్రి వారు ఎక్కువ పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం అందుతోంది. అంతే కాకుండా సినిమా సక్సెస్‌ అయితే షేర్‌లో దాదాపుగా 25% వాటాను సైతం బన్నీకి ఇచ్చేందుకు మైత్రి మూవీ మేకర్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నారనే పుకార్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. లోకేష్ కనగరాజ్‌ సినిమాలు చాలా సింపుల్‌గా చాలా స్పీడ్‌గా ఉంటాయి. కనుక అల్లు అర్జున్‌తో లోకేష్ కనగరాజ్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు పెట్టబోతున్న సినిమా కచ్చితంగా ఏడాదిలోపే విడుదల చేసే అవకాశం ఉంది.

అట్లీ, అల్లు అర్జున్‌ రాకా మూవీ రిలీజ్‌ డేట్‌..

ఒకవైపు రాకా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటూ ఉండగానే, మరో వైపు అల్లు అర్జున్‌, లోకేష్‌ల కాంబో మూవీ షూటింగ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ సినిమాల్లో ఎక్కువగా వీఎఫ్‌ఎక్స్‌ హడావిడి ఉండదు. కనుక రాకా విడుదలకు ముందే అయినా లోకేష్‌ కనగరాజ్‌, అల్లు అర్జున్‌ కాంబో మూవీ విడుదల అయ్యే అవకాశం ఉంది, అలా కాదంటే రాకా విడుదల అయినా రెండు మూడు నెలల్లోనే వీరి కాంబో మూవీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని బన్నీ కాంపౌండ్ నుంచి సమాచారం అందుతోంది. అంటే ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో అల్లు అర్జున్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌, లోకేష్ కనగరాజ్‌ మూవీకి పవర్‌ఫుల్‌ టైటిల్‌ 'గ్యాంగ్‌స్టర్‌' ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సినిమాను అఫిషియల్‌గా అనౌన్స్ చేసి, సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని మైత్రి మూవీ కాంపౌండ్‌ నుంచి సమాచారం అందుతోంది.

అల్లు అర్జున్‌ మూవీ 'గ్యాంగ్‌స్టర్‌' ఎప్పుడు...

లోకేష్ కనగరాజ్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సూపర్‌ హిట్స్ ఇచ్చాడు, అదే సమయంలో బ్యాక్ టు బ్యాక్ రీసెంట్‌గా ఫ్లాప్స్ చవిచూశాడు. కనుక లోకేష్‌ దర్శకత్వంలో బన్నీ సినిమా అంటే ఫ్యాన్స్‌లో కాస్త ఆందోళన కనిపిస్తోంది. కానీ బన్నీ మాత్రం చాలా నమ్మకంతో లోకేష్‌తో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. పైగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ మొత్తంలో ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. సినిమా బడ్జెట్‌తో పోల్చితే బన్నీ పారితోషికం చాలా ఎక్కువ అనే టాక్‌ సైతం వినిపిస్తోంది. మొత్తానికి అల్లు అర్జున్‌, లోకేష్ కనగరాజ్‌ మూవీ సెట్స్ పైకి వెళ్లడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయింది. కనుక రాకా సినిమాకు ముందు ఈ గ్యాంగ్‌స్టర్‌ మూవీ వస్తుందా లేదంటే రాకా సినిమా విడుదల అయిన తర్వాత రెండు మూడు నెలలకు వస్తుందా అని అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వచ్చినా, ఎలా వచ్చినా కచ్చితంగా ఈ రెండు సినిమాలు చాలా తక్కువ గ్యాప్‌లోనే అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ను మెప్పించేందుకు రాబోతున్నాయి.