Begin typing your search above and press return to search.

తాతయ్య జ్ఞాపకాల్లో అల్లు అర్జున్..!

అల్లు రామలింగయ్య జయంతి నాడు తాతను గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ ఈ మెసేజ్ పెట్టారు.

By:  Ramesh Boddu   |   1 Oct 2025 1:38 PM IST
తాతయ్య జ్ఞాపకాల్లో అల్లు అర్జున్..!
X

అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అల్లు అర్జున్ ఒక స్పెషల్ మెసేజ్ ని తన సోషల్ మీడియాలో పెట్టారు. తాతగారు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నా. సినిమాలో మా కుటుంబ ప్రయాణానికి పునాది ఆయన. తరతరాలుగా మా జీవిత గమనాన్ని మార్చిన వ్యక్తి ఆయన. ఆయన వారసత్వాన్ని వినయం, కృతజ్ఞతతో ముందుకు తీసుకెళ్తున్నాం అని రాసుకిచ్చారు.

అల్లు ఫ్యామిలీలో ఆయన మొదలు పెట్టిన ప్రస్థానం..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అల్లు రామలింగయ్య ఒక లెజెండ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చేసిన ప్రతి పాత్ర ఎంతో స్పెషల్ గా అనిపిస్తుంది. ఇక ఆయన కామెడీ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో అల్లు రామలింగయ్య గారి నటన తెలుగు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది.

అల్లు ఫ్యామిలీలో ఆయన మొదలు పెట్టిన సినీ ప్రస్థానం ఆ తర్వాత అల్లు అరవింద్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా.. అల్లు అర్జున్ స్టార్ హీరోగా, అల్లు శిరీష్ కూడా హీరోగా రాణించేలా చేసింది. ఇక అల్లు హీరోగా అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలు.. అందుకున్న అవార్డులు తెలిసిందే. పుష్ప సినిమాతో ఇన్నేళ్ల తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ అట్లీతో సినిమా..

పుష్ప 2 లో కూడా అల్లు అర్జున్ నటన అదిరిపోయింది. అల్లు రామలింగయ్య జయంతి నాడు తాతను గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ ఈ మెసేజ్ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారని తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమాల సెలక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. పుష్పతో హిట్ కొట్టిన వెంటనే అట్లీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఈ సినిమాలో దీపిక పదుకొనె, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

పుష్ప తర్వాత అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ వచ్చింది. నెక్స్ట్ అట్లీ సినిమాకు ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అట్లీ కూడా షారుఖ్ తో జవాన్ సినిమా చేసి సత్తా చాటాడు. అల్లు అర్జున్ తో చేసే సినిమా కచ్చితంగా వేరే లెవెల్ అనిపిస్తుందని తెలుస్తుంది.