Begin typing your search above and press return to search.

బన్నీ టీమ్‌ లోని మార్కెటింగ్ మైండ్.. నిర్మాతగా కూడా మ్యాజిక్ చేశారా?

సినిమా హిట్ కావాలంటే మంచి కథ అవసరం. ఆ స్టోరీ ప్రేక్షకుల దృష్టికి చేరాలంటే సరైన ప్రమోషన్స్ కూడా అంతే అవసరం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి శరత్ చంద్ర నాయుడు.

By:  M Prashanth   |   17 July 2026 11:04 PM IST
బన్నీ టీమ్‌ లోని మార్కెటింగ్ మైండ్.. నిర్మాతగా కూడా మ్యాజిక్ చేశారా?
X

సినిమా హిట్ కావాలంటే మంచి కథ అవసరం. ఆ స్టోరీ ప్రేక్షకుల దృష్టికి చేరాలంటే సరైన ప్రమోషన్స్ కూడా అంతే అవసరం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి శరత్ చంద్ర నాయుడు. ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీ ప్రమోషనల్ ప్లాన్స్ ను రూపొందించిన ఆయన, ఇప్పుడు నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నారనే చర్చ టాలీవుడ్‌ లో జరుగుతోంది.

అల్లు అర్జున్ టీమ్‌ లో చాలా కాలంగా కీలక సభ్యుడిగా పనిచేస్తున్న శరత్ చంద్ర నాయుడు పేరు ఇండస్ట్రీ వర్గాలకు కొత్త కాదు. ముఖ్యంగా డిజిటల్ ప్రమోషన్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, ప్రేక్షకుల ప్లస్ పట్టే మార్కెటింగ్ ప్లాన్స్ లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈసారి ఆయన ప్రొడ్యూసర్ గా మారారు. ఆయన నిర్మించిన తొలి వెబ్ సిరీస్ గుర్తుకొస్తున్నాయి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమైంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టులో ఆయన కేవలం డబ్బు పెట్టిన నిర్మాత మాత్రమే కాదు. కథ డెవలప్మెంట్ నుంచి కంటెంట్ క్రియేషన్ వరకు తన వంతు పాత్ర పోషించారు. ఆ వెబ్ సిరీస్‌ కు మెయిన్ పాయింట్ కూడా ఒక డిజిటల్ ఆలోచనే. శరత్ చంద్ర నిర్వహించిన రేలంగి మావయ్య సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లో 90ల నాటి జ్ఞాపకాలను పంచుకుంటూ వచ్చిన కంటెంట్‌ కు మంచి ఆదరణ లభించింది.

ఆ అనుభూతులను మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరవేయాలనే ప్రయత్నమే గుర్తుకొస్తున్నాయిగా మారింది. మార్కెటింగ్ రంగంలో పనిచేసిన వారికి ప్రేక్షకుల టేస్ట్ పై మంచి అవగాహన ఉంటుంది. ఏ అంశం కనెక్ట్ అవుతుంది? ఏ ఎమోషన్ ఎఫెక్ట్ చూపుతుంది? అనే విషయాలను వారు దగ్గరగా గమనిస్తుంటారు. అదే అనుభవం ఆ వెబ్ సిరీస్ డిజైనింగ్ లో ఉపయోగపడిందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

ఇంకో విశేషం ఏమిటంటే.. శరత్ చంద్ర కొత్త జర్నీపై అల్లు అర్జున్ కూడా ప్రత్యేకంగా స్పందించడం. చాలా కాలంగా తనతో కలిసి పనిచేసిన వ్యక్తి నిర్మాతగా మారడాన్ని బన్నీ అభినందించినట్లు తెలుస్తోంది. ఈ సపోర్ట్ శరత్ చంద్ర జర్నీకి మరింత ఇంపార్టెన్స్ తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక విభిన్న ధోరణి కనిపిస్తోంది. తెరపై కనిపించే వారే కాకుండా, తెరవెనుక పనిచేసే టాలెంటెడ్ పార్సన్స్ కూడా నిర్మాతలు, రచయితలు, క్రియేటివ్ మేకర్లుగా ఎదుగుతున్నారు.

శరత్ చంద్ర నాయుడు జర్నీ కూడా అదే కోవలోకి వస్తోంది. ఏదేమైనా ప్రేక్షకుల పల్స్ తెలుసుకున్న మార్కెటింగ్ ఎక్స్పర్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న శరత్ చంద్ర నాయుడు.. ఇప్పుడు నిర్మాతగా కూడా మంచి ఆరంభం అందుకున్నారు. తొలి ప్రయత్నానికే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, బన్నీ టీమ్‌ లోని ఆ మార్కెటింగ్ మైండ్ నిర్మాతగా కూడా మ్యాజిక్ చేసినట్టేనా అనే ప్రశ్నకు ఇండస్ట్రీ నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఫ్యూచర్ లో ఆయన నుంచి మరిన్ని ఆసక్తికరమైన కథలు వస్తాయేమో చూడాలి.