Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ దృష్టిలో పడ్డాడా..?

ఐతే ఇన్న్నర్ టాక్ ఏంటంటే ఓజీ సినిమాను అల్లు అర్జున్ కూడా బాగా ఎంజాయ్ చేశాడట. అంతేకాదు డైరెక్టర్ వర్క్ కి బన్నీ ఫిదా అయ్యాడని టాక్.

By:  Ramesh Boddu   |   28 Sept 2025 10:33 AM IST
పుష్ప రాజ్ దృష్టిలో పడ్డాడా..?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా తీసి ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ ఇచ్చాడు డైరెక్టర్ సుజిత్. ఒక పవర్ స్టార్ అభిమానిగా ఫ్యాన్స్ ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించి వాళ్లను ఖుషి చేశాడు. ముఖ్యంగా ఈమధ్య కాలంలో పవర్ స్టార్ సినిమాకు ఇలా ఫ్యాన్స్ అందరి నుంచి సూపర్ హిట్ టాక్ రావడం గొప్ప విషయం. ఈమధ్య స్టార్ సినిమాలు వాళ్ల ఫ్యాన్సే డిజప్పాయింట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఓ పక్క యాంటీ ఫ్యాన్స్ చేసే ట్రోలింగ్స్ కి సమాధానం ఇవ్వాలంటే ఫ్యాన్స్ కి ఆ సినిమా బాగా ఎక్కాలి. ఓజీ ఆ విషయంలో పి.ఎస్.పి.కె ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చింది.

టాప్ హీరోలు కూడా ఓజీ..

ఓజీ సినిమాను కేవలం పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం చూశారు. సినిమాపై వచ్చిన బజ్ కి ఎలా ఉందో ఓసారి చూసేద్దాం అన్న ఆసక్తి ఏర్పడింది. అందుకే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులు, హీరోలు అంతా కూడా ఓజీ సినిమా చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఓజీ సినిమాను టాప్ హీరోలు కూడా చూశారు. రీసెంట్ గానే అల్లు అర్జున్ కూడా ఏ.ఎం.బి మాల్ లో ఓజీ చూశారు.

ఓజీ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గా సుజిత్ తో పనిచేయాలని స్టార్స్ కి ఉంటుంది. సరే సినిమా కథ కాస్త డిజప్పాయింట్ చేసినా కూడా మేకింగ్ పరంగా టెక్నికల్ స్టాండర్డ్స్ పరంగా పవర్ స్టార్ కి ఇచ్చిన ఎలివేషన్స్ చూసి సుజిత్ తో కలిసి పనిచేయాలని అనుకుంటారు. ఆ లిస్ట్ లో ఐకాన్ స్టార్ మన పుష్ప రాజ్ అల్లు అర్జున్ కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదు. అల్లు అర్జున్ ఓజీ సినిమా చూసి రివ్యూ ఏదైనా ఇస్తారని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన నుంచి రెస్పాన్స్ రాలేదు.

టాలెంటెడ్ డైరెక్టర్స్ తో అల్లు అర్జున్..

ఐతే ఇన్న్నర్ టాక్ ఏంటంటే ఓజీ సినిమాను అల్లు అర్జున్ కూడా బాగా ఎంజాయ్ చేశాడట. అంతేకాదు డైరెక్టర్ వర్క్ కి బన్నీ ఫిదా అయ్యాడని టాక్. ఛాన్స్ ఉంటే సుజిత్ తో ఒక సినిమా చేసినా చేయొచ్చు అనేలా చర్చలు నడుస్తున్నాయి. అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో పనిచేయడానికి ఇష్టపడతాడు. పుష్ప తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అతను నెక్స్ట్ చేస్తున్న సినిమాలన్నీ కూడా అదే రేంజ్ ఇంపాక్ట్ ఉండేలా చేస్తున్నాడు.

పుష్ప రాజ్ దృష్టిలో సుజిత్ పడ్డాడంటే కచ్చితంగా మంచి కథ సెట్ అయితే ఈ కాంబో సినిమా ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.