వారంలో చూసే లాభం ఒక్క పూటలో ఇచ్చేసిన బన్నీ!
జీవింతం ఎంత సింపుల్ గా ఉంటే జీవితాంతం అంత సంతోషంగా ఉండగలమని నమ్మే తారుల. తాజాగా బన్నీ ఒక్క పూటలోనే లక్షల రూపాయలు ఖర్చు చేసాడు.
By: Srikanth Kontham | 30 Dec 2025 4:23 PM ISTసెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. వాళ్ల స్థాయిని బట్టి లైఫ్ స్టైల్ ని డిజైన్ చేసుకుని వెళ్తుంటారు. అందుకోసం లక్షలు ఖర్చు అవ్వొచ్చు..కోట్లు ఖర్చు అవ్వొచ్చు. కానీ బన్నీ స్టార్ హోటల్ లోనూ భోజనం చేయగలడు. కాకా హోటల్ లో సైతం లంచ్ చేసేంత సింపుల్ సిటీ అతడి సొంతం. `పుష్ప` షూటింగ్ సమయంలో ఓ రోడ్డు పక్కన చిన్న హోటల్ లో బన్నీ బ్రేక్ పాస్ట్ చేయడం అప్పట్లో ఓ సంచలనంగా మారింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ కూడా సాధారణ హోటల్ కి వెళ్లి వాళ్లతో కలిసి భోజనం చేయడం అంతే వైరల్ అయింది. వీరిద్దిరి సిద్దాంతం ఒక్కటే.
జీవింతం ఎంత సింపుల్ గా ఉంటే జీవితాంతం అంత సంతోషంగా ఉండగలమని నమ్మే తారుల. తాజాగా బన్నీ ఒక్క పూటలోనే లక్షల రూపాయలు ఖర్చు చేసాడు? వారమంతా కష్టపడితే గాని చూడని డబ్బును ఒక్క పూటలోనే ఓ రెస్టారెంట్ కి చెల్లించి షాక్ ఇచ్చాడు బన్నీ. ఆ వివరాల్లోకి వెళ్తే. బన్నీ ఇటీవల బెల్జియం పర్యటించిన సంగతి తెలిసిందే. తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు పార్టీని ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. దీనిలో భాగంగా బెల్జియంలోనే అత్యంత విలాసవంతమైన సేవలు అందించే ప్రముఖ లగ్జరీ కాన్సియర్జ్ రెస్టారెంట్ ముందు ల్యాండ్ అయ్యారు.
వారు వెళ్లే సమయానికి రెస్టారెంట్ మూత పడి ఉంది. కానీ బన్నీ స్నేహితులు అదే రెస్టారెంట్ లో భోజనం చేయాలని పట్టుబట్టడంతో? రెస్టారెంట్ యాజమాన్యంతో మాట్లాడి ఓపెన్ చేయించారు. కేవలం బన్నీ కోసమే ఓపెన్ చేసి ఒక్క పూట సేవలందించారు. అందుకోసం ఆ రెస్టారెంట్ ఒక వారాంతం మొత్తంలో సంపాదించే ఆదాయాన్ని (లక్షల్లో) చెల్లించారు. వారికి ఇష్టమైన భారతీయ వంటకాల్ని, వారి అభిరుచికి తగ్గ సంగీతాన్ని ఏర్పాటు చేశారు. ఆ సాయంత్రం వారి కోరిన సకల వంటకాలు అందించి ఫిదా చేసారు.
గతంలో ఇదే రెస్టారెంట్ లో ఎంతో మంది హాలీవుడ్ స్టార్లు, బాలీవుడ్ స్టార్లకు సేవలందించామని యాజమాన్యం తెలిపింది. కానీ బన్నీతో ఆ సాయంత్రం మాత్రం అత్యంత అరుదైన అనుభవంగా చెప్పుకొచ్చారు. బన్నీ నిజంగా గ్రేట్. స్నేహితు లని ఎంత మాత్రం నిరుత్సాహపరచకూడదు అన్న కారణంతో ఆ పూట కోసమే లక్షలు ఖర్చు చేసి వారికి కావాల్సిన ఏర్పాటు చేయించాడు. అదీ ఓ విదేశంలో. హైదరాబాద్ సహా దేశంలో ఎక్కడైనా బన్నీకి ఇలాంటి సేవలు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. కానీ విదేశంలో కూడా పుష్ప రాజ్ తగ్గేదేలే అని నిరూపించాడు.
