Begin typing your search above and press return to search.

ఆమ్‌స్ట‌ర్ డామ్‌లో అంద‌మైన ప్రేమ‌ జంట‌

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ త‌న కెరీర్ బెస్ట్ ఫేజ్‌ని ఆస్వాధిస్తున్నాడు. `పుష్ప` చిత్రంతో టాలీవుడ్‌లో మొట్ట‌మొద‌టి జాతీయ ఉత్త‌మ న‌టుడిగా గౌర‌వాన్ని అందుకున్నాడు

By:  Sivaji Kontham   |   10 Oct 2025 10:37 PM IST
ఆమ్‌స్ట‌ర్ డామ్‌లో అంద‌మైన ప్రేమ‌ జంట‌
X

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ త‌న కెరీర్ బెస్ట్ ఫేజ్‌ని ఆస్వాధిస్తున్నాడు. `పుష్ప` చిత్రంతో టాలీవుడ్‌లో మొట్ట‌మొద‌టి జాతీయ ఉత్త‌మ న‌టుడిగా గౌర‌వాన్ని అందుకున్నాడు. తెలుగు చిత్ర‌సీమ‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాని మ‌రో లెవ‌ల్ కి తీసుకుని వెళ్లిన స‌మ‌ర్థులైన న‌టుల‌లో ఒక‌రిగాను గుర్తింపును సంపాదించాడు. అల్లు ఫ్యామిలీ చియాన్ గా అత‌డి ఇమేజ్ ఎదురేలేని స్థాయికి చేరుకుంది. ప్ర‌స్తుతం అట్లీ దర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ అత‌డిని మ‌రో రేంజుకు తీసుకెళ్ల‌బోతోంది.

అయితే కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్ కి అల్లు అర్జున్ ఇచ్చే ప్రాధాన్య‌త అంద‌రికీ స్ఫూర్తి. ప్ర‌స్తుతం అత‌డు త‌న భార్య స్నేహ రెడ్డితో కలిసి ఆమ్‌స్ట‌ర్ డామ్ లో విహ‌రిస్తున్నాడు. కింగ్ డ‌మ్ ఆఫ్ నెద‌ర్లాండ్స్ లో ఎగ్జోటిక్ లొకేష‌న్‌ని ఆస్వాధిస్తున్నాడు. అత‌డు ఆమ్ స్ట‌ర్ డామ్ వీధుల్లో స్నేహారెడ్డితో పాటు దిగిన ఫోటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోగ్రాఫ్ లో బ‌న్ని స్టైలిష్ లుక్ తో ఆక‌ట్టుకుంటున్నాడు. స్నేహారెడ్డి కూడా అంతే బ్రిలియంట్ ఫ్యాష‌నిస్టాగా మురిపిస్తున్నారు. ఇది ప్రేమ విహార‌యాత్ర‌. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ ఎంతో అందంగా కుదిరింది. ఈ ఫోటోల‌కు ``ప్రయాణం లేదు, కేవలం మాయాజాలం`` అనే వ్యాఖ్యను జోడించారు. ప్ర‌స్తుతం ఈ జంట ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేస్తూ అభిమానులు ఈమోజీల‌తో వారికి విషెస్ తెలియ‌జేస్తున్నారు. అంద‌మైన జంట .. వారి ప్రేమ క‌థ చాలా మందికి స్ఫూర్తినిస్తూనే ఉందని కూడా ప్ర‌శంసిస్తున్నారు.

6 మార్చి 2011న హైదరాబాద్‌లో ఈ జంట వివాహం అయింది. 14 సంవ‌త్స‌రాల ప్ర‌యాణంలో వారు ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించుకున్నారు. ఇద్దరు ముద్దులొలికే క్యూట్ కిడ్స్ ఈ జంట‌కు ఉన్నారు. వార‌సులు అయాన్, అర్హ వేగంగా ఎదిగేస్తున్నారు. అర్హ 2023లో సమంత రూత్ ప్రభు న‌టించిన `శాకుంతలం` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో ప్రిన్స్ భరత పాత్రను పోషించింది.