బ్లాస్టింగ్ స్టార్మ్స్...ఏంటీ లైనప్ బన్నీ?
తేజ సజ్జ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకు ప్రతి హీరో లైనప్ చాలా హైలోనే ఉంటోంది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్క్రిప్ట్ సెలెక్టింగ్ స్ట్రాటజీ మాత్రం చాలా భిన్నంగా ఉంటోంది.
By: Ravindar Gorantla | 3 March 2026 10:00 PM ISTపాన్ ఇండియా సినిమాల ప్రవాహం మొదలైన దగ్గరి నుంచి టాలీవుడ్ స్టార్స్ మూండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఏ హీరోని కదిలించినా `థింక్ బిగ్` అనే స్థాయిలోనే ప్రాజెక్ట్‌లని ఎంచుకుంటున్నారు. తేజ సజ్జ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకు ప్రతి హీరో లైనప్ చాలా హైలోనే ఉంటోంది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్క్రిప్ట్ సెలెక్టింగ్ స్ట్రాటజీ మాత్రం చాలా భిన్నంగా ఉంటోంది. అందరు హీరోలు భారీ పాన్ ఇండాయాని టార్గెట్ చేస్తూ సినిమాలు ఎంచుకుంటుంటే బన్నీ మాత్రం అంతకు మించి అన్నట్టుగా వ్యవహరిస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు.
బన్నీ నటించిన `పుష్ప 2` ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి విజయాన్ని అందించడమే కాకుండా తనకు తిరుగులేని గుర్తింపుని తెచ్చి పెట్టింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డుని కూడా తెచ్చి పెట్టడంతో ఇకపై అంతకు మించి అనే స్థాయిలో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే నెవర్ బిఫోర్ అనే స్థాయి సినిమాలని ఎంచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. తను ఎంపిక చేసుకుంటున్న ఒక్కోప్రాజెక్ట్ ఒక్కో స్టోర్మ్‌గా ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించనున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో ఓ భారీ పాన్‌వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ లేడీ దీపికా పదుకునే కీలక పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందన్న ఫస్ట్ టైమ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతున్నా టీమ్ ఇంత వరకు ఈ ఊహాగానాలపై స్పష్టతనివ్వలేదు. అలా అని ఖండించనూ లేదు.
AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని అందించనుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ అండర్ ప్రొడక్షన్‌లో ఉండగానే బన్నీ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని ఓకే చేయడం, స్టార్ట్ చేయడం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దీనికి దర్శకుడు. అనౌన్స్ మెంట్ వీడియోతో అంచనాల్ని పెంచేసిన ఈ జోడీ సినిమాతో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది. ఈ రెండు క్రేజీ స్టోర్మ్‌లతో పాటు బన్నీ మరో సూపర్ హీరో స్టోరీకి కూడా లైన్‌లో పెట్టేశాడు.
AA23ని లోకేష్ కనగరాజ్‌తో చేస్తున్న బన్నీ AA24ని మలయాళ నటుడు, డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌తో చేయడానికి రెడీ అవుతున్నాడు. దీని తరువాతే సందీప్ రెడ్డి వంగ క్రేజీ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ క్రేజీ లైనప్ చూసిన అభిమానులు, నెటిజన్‌లు అంతా ఇది లైనప్ కాదు క్రేజీ బ్లాస్టింగ్ స్టార్మ్స్ అని, బన్నీ ఒక్కో ప్రాజెక్ట్‌ని జాగ్రత్తగా పిక్ చేసుకుంటూ టేకోవర్ చేసుకుంటున్నాడని ఆనందిస్తున్నారు. అంతే కాకుండా ఈ భారీ మూవీ డైరెక్టర్స్ శిరీష్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో చూసి ఖుషీ చేసుకుంటున్నారు.
