Begin typing your search above and press return to search.

బన్నీ.. ఆ మూవీ ఉన్నట్టా? లేనట్టా?

దీంతో ఆ సినిమా అనౌన్స్మెంట్ రావడంతో.. వంగాతో బన్నీ అనుకున్న మూవీ ఏమైందోనని అంతా డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు.

By:  M Prashanth   |   16 Jan 2026 4:00 PM IST
బన్నీ.. ఆ మూవీ ఉన్నట్టా? లేనట్టా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందనున్నట్లు కొన్ని నెలల క్రితం అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప-2 తర్వాత బన్నీ, వంగా కాంబోలో మూవీ వస్తుందంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ప్రకటించింది. దీంతో అటు సినీ ప్రియులు.. ఇటు ఇద్దరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సందీప్ రా& ఇంటెన్స్ మేకింగ్ కు బన్నీ యాక్టింగ్ పెర్ఫెక్ట్ సెట్ అవుతుందని అంతా సంబరపడిపోయారు. కానీ ఆ సినిమాపై అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడం గమనార్హం. చెప్పాలంటే.. చాలా మంది ఆ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిందన్న విషయమే మర్చిపోయారు. అయితే బన్నీ.. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో వర్క్ చేయనున్నట్లు రీసెంట్ గా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీతో పని చేస్తున్న అల్లు అర్జున్.. ఆ తర్వాత లోకేష్ తో మూవీ చేయనున్నారు. దీంతో ఆ సినిమా అనౌన్స్మెంట్ రావడంతో.. వంగాతో బన్నీ అనుకున్న మూవీ ఏమైందోనని అంతా డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అసలు ఆ సినిమా ఉందో లేదా కూడా ఎలాంటి క్లారిటీ లేదని అంటున్నారు. ఒకవేళ ఉంటే.. అదేదో మరోసారి క్లారిటీ ఇస్తే బెటర్ అని అంతా అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్.. అట్లీ దర్శకత్వం వహిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది అక్టోబరు వరకు ఆ మూవీ చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. అది కంప్లీట్ అయ్యాక.. లోకేష్ కనగరాజ్ తీయనున్న సినిమా సెట్స్ లోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వనున్నారట. ఆ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదికి పూర్తి అవ్వనుందని అర్థమవుతోంది.

ఆ రెండు కాకుండా.. అల్లు అర్జున్ లైనప్ లో త్రివిక్రమ్ తో ఓ మూవీ కూడా ఉంది. అది పక్కన పెట్టారని వార్తలు వస్తున్నా.. ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కొందరు ఆ సినిమా డ్రాప్ అయిందని చెబుతుంటే, మరికొందరు మాత్రం చర్చల దశలోనే ఉందని అంటున్నారు. ఒక వేళ ఆ మూవీ కూడా ఉంటే.. అల్లు అర్జున్ మరో రెండు మూడేళ్ల వరకు చాలా బిజీగా ఉండనున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అదే సమయంలో యానిమల్ అయిన వెంటనే స్పిరిట్ మూవీ కోసం వర్క్ చేయడం మొదలుపెట్టారు సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు షూటింగ్ ను జరుపుతున్న ఆయన.. ఆ తర్వాత యానిమల్ పార్క్ పై ఫోకస్ చేయనున్నారని తెలుస్తోంది. అనంతరం మహేష్ బాబు లేదా రామ్ చరణ్ తో సినిమా చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. దీంతో సందీప్ కూడా కొన్నాళ్లపాటు బిజీనే. మరి బన్నీ, వంగా మూవీ ఫ్యూచర్ లో ఉంటుందో లేదో వేచి చూడాలి.