ఈ ఇద్దరు స్లార్లు కలిస్తే డబుల్ ధమాకా ఎనర్జీ
కొన్ని కలయికలు చాలా అరుదుగానే సాధ్యపడతాయి. అలాంటి ఒక కలయిక సాధ్యపడాలని ఇప్పుడు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అది కచ్ఛితంగా ఎనర్జీ ప్లస్ ఎనర్జీ... డబుల్ ఎనర్జీగా మారుతుంది.
By: Sivaji Kontham | 20 Oct 2025 9:14 AM ISTకొన్ని కలయికలు చాలా అరుదుగానే సాధ్యపడతాయి. అలాంటి ఒక కలయిక సాధ్యపడాలని ఇప్పుడు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అది కచ్ఛితంగా ఎనర్జీ ప్లస్ ఎనర్జీ... డబుల్ ఎనర్జీగా మారుతుంది. వెండితెరపై ధమాకా ట్రీట్ గా మారేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ ఇద్దరు స్టార్లు ఎవరు? అంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కలయిక గురించే ఇదంతా.
ఇటీవల రణ్ వీర్ చేసిన ఒక కామెంట్ చూస్తుంటే భవిష్యత్ లో అల్లు అర్జున్ తో రణ్ వీర్ కలిసి పని చేసేందుకు సుముఖంగా ఉన్నారని అభిమానులు అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ లో హైఎనర్జీతో భారీ యాక్షన్ సినిమాల్లో నటించే అల్లు అర్జున్, బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ గా పేరున్న రణ్ వీర్ తో కలిసి ఒక పూర్తి స్థాయి యాక్షన్ సినిమా కోసం పని చేస్తే అది స్పెషల్ ట్రీట్ గా మారుతుందని అంతా భావిస్తున్నారు.
ఇటీవల రణ్ వీర్ సింగ్- శ్రీలీల- బాబి డియోల్ కాంబినేషన్ లో రూపొందించిన `ఏజెంట్ చింగ్` ప్రకటన వీడియో ఫ్యాన్స్ ని ఎగ్జయిట్ చేసింది. ఈ వాణిజ్య ప్రకటన విడుదల తర్వాత రణ్ వీర్ చేసిన కామెంట్ అల్లు ఫ్యాన్స్ ని మరింతగా ఎగ్జయిట్ చేసింది. అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ మూవీలో నటిస్తున్న తన భార్య గురించి ప్రస్థావిస్తూ, ఈ సినిమా భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని ఒక మహదాద్భుతం! అంటూ కీర్తించాడు. అతడి ప్రకటన చూసాక సైన్స్ ఫిక్షన్ జానర్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని అట్లీ తీర్చిదిద్దుతున్న విధానంపై మరింత నమ్మకం పెరిగింది.
అదే సమయంలో అల్లు అర్జున్- రణ్ వీర్ లాంటి ఎనర్జిటిక్ హీరోలు కలిసి ఒక సినిమా కోసం లేదా ఫ్రాంఛైజీ సినిమా కోసం పని చేస్తే అది మరింత స్పెషల్ ట్రీట్ గా మారుతుందని కూడా అభిమానులు భావిస్తున్నారు. రణ్ వీర్ తన కెరీర్ లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో అతడు దక్షిణాది హీరోలు, దర్శకులతో కలిసి పని చేయాలనుకుంటున్నాడు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించినా అది వీలుపడలేదు. కానీ ఇప్పుడు అట్లీతో అతడు కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని అర్థమవుతోంది. భవిష్యత్ లో అల్లు అర్జున్- అట్లీ జోడీ నుంచి వస్తున్న భారీ ఫ్రాంఛైజీ చిత్రంలో రణ్ వీర్ భాగం అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
