Begin typing your search above and press return to search.

రామాయణ.. జపాన్ సీఈఓకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్

నేడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక ఆయన తీసుకున్న నిర్ణయం వైరల్ అవుతోంది. మన దేశ సంస్కృతిని, గొప్పతనాన్ని ఇతర దేశాల వారికి పరిచయం చేయడంలో తన వంతు బాధ్యతను నెరవేర్చారు.

By:  M Prashanth   |   27 March 2026 11:55 PM IST
రామాయణ.. జపాన్ సీఈఓకు అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఐకాన్ స్టైల్ తో వెండితెరపైనే కాకుండా, బయట కూడా అందరినీ ఆకట్టుకుంటున్నారు. నేడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక ఆయన తీసుకున్న నిర్ణయం వైరల్ అవుతోంది. మన దేశ సంస్కృతిని, గొప్పతనాన్ని ఇతర దేశాల వారికి పరిచయం చేయడంలో తన వంతు బాధ్యతను నెరవేర్చారు.

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'గీక్ పిక్చర్స్' సీఈఓ మిస్టర్ టొమట్సు కొసానోతో అల్లు అర్జున్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక అద్భుతమైన "సీతారామ కల్యాణం" పెయింటింగ్‌ను బహుమతిగా అందించారు. ఆ పెయింటింగ్‌లో రామాయణానికి సంబంధించిన ముఖ్యాంశాలు చాలా కళాత్మకంగా ఉన్నాయి. కేవలం బహుమతి ఇవ్వడమే కాకుండా, ఆ చిత్రంలోని ప్రతి అంశాన్ని కొసానోకు వివరించి మన వారసత్వంపై గౌరవం పెంచారు.

రామాయణ కావ్యం వెనుక ఉన్న చారిత్రక ప్రాధాన్యత గురించి అల్లు అర్జున్ ఈ భేటీలో చర్చించారు. మన పురాణాలలోని ఆధ్యాత్మిక సారాంశం నేటి కాలానికి ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ఒక భారతీయ నటుడిగా మన సంస్కృతిని విదేశీయులకు ఇంత వివరంగా చెప్పడం గమనార్హం. జపాన్ లాంటి దేశానికి చెందిన ఒక పెద్ద కంపెనీ హెడ్ మన రామాయణం గురించి ఆసక్తిగా వినడం విశేషం.

ఈ వీడియోలో అల్లు అర్జున్ ఆ పెయింటింగ్ లోని కళాఖండాలను చూపిస్తూ ఎంతో ఓపికగా వివరిస్తున్నారు. రాముడు, సీత.. ఆ కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబించే ఆ చిత్రం కొసానోను బాగా ఆకట్టుకుంది. ఇలాంటి పనుల వల్ల మన దేశ గౌరవం ప్రపంచ స్థాయిలో మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఇలాంటి మంచి పనులతో అల్లు అర్జున్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయంలో, ఇలాంటి ఒక స్పిరిచువల్ అప్‌డేట్ రావడంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్‌లో కూడా మన సంస్కృతికి ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అల్లు అర్జున్ అందించిన ఈ గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. లైనప్ లో సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.