రాకా నుంచి త్వరలోనే అప్డేట్.. బన్నీ నెక్స్ట్ రికార్డ్ బుక్ ఓపెన్ కాబోతుందా?
రాకాను కేవలం భారతీయ మార్కెట్‌కే పరిమితం చేయకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 24 July 2026 11:44 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమా రాకాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ గా చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే బయటకు వచ్చినా, తాజాగా బన్నీ మేనేజర్, నిర్మాత శరత్ చంద్ర చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి. రాకా నుంచి త్వరలోనే ఒక మ్యాజికల్ అప్డేట్ రానుందని ఆయన చెప్పడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై డిస్కషన్స్ మళ్లీ ఊపందుకున్నాయి.
పుష్ప ఫ్రాంచైజీతో అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తన మార్కెట్‌ను విస్తరించుకున్నారు. అలాంటి సమయంలో ఆయన కెరీర్‌లో తదుపరి అడుగుగా వస్తున్న రాకాను ఫ్యాన్స్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా కాకుండా, కొత్త దశకు నాంది పలికే ప్రాజెక్ట్‌గా చూస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ అట్లీతో బన్నీ కాంబినేషన్ కావడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను గ్రాండ్ విజువల్స్‌తో అందించడంలో అట్లీకి ఉన్న గుర్తింపు ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది.
రాకాను కేవలం భారతీయ మార్కెట్‌కే పరిమితం చేయకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. భారీ కాన్వాస్, అత్యాధునిక విజువల్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా రూపొందుతుంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉన్నప్పటికీ, ఈ అంచనాలే సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి.
బాక్సాఫీస్ పరంగా కూడా రాకాపై భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్‌కు హిందీ మార్కెట్‌లో ఏర్పడిన క్రేజ్, ఓవర్సీస్‌లో పెరిగిన అభిమాన వర్గం, గ్లోబల్ రిలీజ్‌లపై పెరిగిన ఇంట్రెస్ట్.. ఇవన్నీ కలిపి ఈ సినిమాను ఓపెనింగ్ డే నుంచే రికార్డుల రేసులో నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా హిందీ నెట్ కలెక్షన్స్, ఓవర్సీస్ గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వంటి అంశాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అదే సమయంలో అల్లు అర్జున్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లోకేష్ కనగరాజ్‌తో ఒక సినిమా చేయనున్న బన్నీ, ప్రస్తుతం మరో రెండు, మూడు కథలు కూడా వింటున్నట్టు సమాచారం. బాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఆయన డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారని శరత్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రాకా నుంచి రాబోయే అప్డేట్ కేవలం ఒక పోస్టర్‌కే పరిమితం కాకుండా, అల్లు అర్జున్ కెరీర్‌లోని తదుపరి దశకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలను ఇవ్వొచ్చనే అంచనాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
