Begin typing your search above and press return to search.

'రాకా' దీపిక.. తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రాకా ప్రస్తుతం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది.

By:  M Prashanth   |   10 April 2026 7:42 PM IST
రాకా దీపిక.. తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రాకా ప్రస్తుతం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. బన్నీ బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ అభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తించింది. తోడేలు లుక్‌ లో కనిపించిన బన్నీ స్టైల్, ఇంటెన్స్ గెటప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పోస్టర్‌ ను చూస్తుంటే చిత్రంలో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఆ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా దర్శకుడు అట్లీ కుమార్ రూపొందిస్తున్నారు. సినిమా బడ్జెట్ సుమారు రూ.900 కోట్లకు పైగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రాజెక్ట్‌ లోని ఫిమేల్ లీడ్ రోల్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తోంది. కల్కి 2898 ఏడీ తర్వాత ఆమె చేస్తున్న రెండో తెలుగు చిత్రం ఇదే.

ప్రస్తుతం ఆ సినిమా కంటే ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది దీపికా రెమ్యూనరేషన్. రాకా కోసం ఆమె దాదాపు రూ.25 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే ఒక హీరోయిన్‌ కు ఇచ్చిన అత్యధిక పారితోషికంగా ప్రచారం జరుగుతోంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ ఆమె డిమాండ్‌ కు మేకర్స్ ఒప్పుకున్నట్లు సమాచారం.

ఇక కల్కి 2898 ఏడీ చిత్రంతో టాలీవుడ్‌ లో అడుగుపెట్టిన దీపికా, ఆ సినిమాలో సుమతి పాత్రలో కనిపించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ మూవీకి ఆమె సుమారు రూ.20 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే రాకా కోసం ఆమె రెమ్యూనరేషన్‌ను మరో ఐదు కోట్లు పెంచినట్లు వినికిడి. ఇదే ఆమె కెరీర్‌ లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికంగా నిలిచే అవకాశం ఉందని టాక్.

మరోవైపు దీపికా ఇటీవల కాలంలో కొన్ని వివాదాలతో వార్తల్లో నిలిచారు.. భారీ ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకున్నట్లు, అధిక డిమాండ్ల కారణంగా మేకర్స్ ఇతర ఆప్షన్లను పరిశీలిస్తున్నారనే ప్రచారం జరిగింది. కల్కి 2 నుంచి ఆమె వైదొలగ్గా.. స్పిరిట్ వంటి బడా ప్రాజెక్ట్‌ నుంచి కూడా తప్పుకున్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో రాకాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

ఇక రాకాలో దీపికా యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. బన్నీతో కలిసి ఆమె స్క్రీన్‌ పై ఎలా మెప్పిస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం రాకాతో పాటు దీపికా బాలీవుడ్‌ లో షారుక్ ఖాన్ తో కింగ్ చిత్రంలో నటిస్తున్నారు.. ఆ మూవీ డిసెంబర్‌ లో విడుదల కానుందని సమాచారం.