Begin typing your search above and press return to search.

అల్లు సినిమాస్: బన్నీ, జక్కన్న ఏం మాట్లాడుకున్నారో?

హైదరాబాద్‌ లోని కోకాపేటలో ప్రముఖ అల్లు కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ కు రీసెంట్ గా సాఫ్ట్ లాంచ్ నిర్వహించారు.

By:  M Prashanth   |   5 Jan 2026 3:37 PM IST
అల్లు సినిమాస్: బన్నీ, జక్కన్న ఏం మాట్లాడుకున్నారో?
X

ప్రస్తుతం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారిన విషయం ఏదైనా ఉందంటే అది అల్లు సినిమాస్ సాఫ్ట్ లాంచ్‌ నే. హైదరాబాద్‌ లోని కోకాపేటలో ప్రముఖ అల్లు కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ కు రీసెంట్ గా సాఫ్ట్ లాంచ్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, బిజినెస్ వర్గాలకు చెందిన ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.

ఆ ఈవెంట్ లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- దర్శకధీరుడు రాజమౌళి మధ్య జరిగిన చర్చ. వీరిద్దరూ కొంతసేపు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? అన్నదానిపై అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అల్లు సినిమాస్ సాఫ్ట్ లాంచ్ సందర్భంగా అల్లు అర్జున్ అతిథులతో ముచ్చటిస్తూ కనిపించారు.

అదే సమయంలో రాజమౌళి మల్టీప్లెక్స్‌ ను ప్రత్యేకంగా పరిశీలించారు. సౌండ్ సిస్టమ్, స్క్రీన్ క్వాలిటీ, సీటింగ్ సౌకర్యాలు వంటి అంశాలపై రాజమౌళి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని సమాచారం. ప్రపంచ స్థాయి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా, థియేటర్ అనుభూతిపై రాజమౌళికి ప్రత్యేక శ్రద్ధ ఎప్పుడూ ఉంటుందన్న విషయం తెలిసిందే.

అదే సమయంలో అల్లు అర్జున్‌తో రాజమౌళి జరిపిన చర్చలో సినిమా అనుభూతిని కొత్త స్థాయికి తీసుకెళ్లే అంశాలు ఉన్నాయని టాక్. భవిష్యత్తులో ప్రేక్షకులు థియేటర్‌ కు వచ్చి సినిమా చూడాలంటే ఏఏ సౌకర్యాలు ఉండాలి, టెక్నాలజీ ఎలా ఉపయోగించాలనే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్, ప్రేక్షకుల అభిరుచులు ఎలా మారుతున్నాయన్న విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

అసలు విషయం ఏమిటంటే.. ఈ చర్చ ఫ్యూచర్ లో అల్లు అర్జున్- రాజమౌళి కాంబినేషన్‌ లో మూవీకి సిగ్నలా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. అయితే, ఇద్దరూ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌ లో ఉండటంతో, వీరి మాటలను అభిమానులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే, చర్చలో ప్రాజెక్టు గురించి ఎలాంటి అధికారిక చర్చ జరగలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి, అల్లు సినిమాస్ సాఫ్ట్ లాంచ్ ఒక బిజినెస్ ఈవెంట్‌ గా మాత్రమే కాకుండా, బన్నీ- జక్కన్న కాంబినేషన్ పై చర్చలకు వేదికగా మారింది. అల్లు అర్జున్, రాజమౌళి వంటి దిగ్గజాలు ఒకే చోట కలవడం, ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అయింది. రాబోయే రోజుల్లో వారిద్దరి నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుందేమో వేచి చూడాలి.