Begin typing your search above and press return to search.

'రాకా'లో అసలైన కిక్ అదే!

ఇక్కడ బన్నీ స్టైల్‌ కు అట్లీ మాస్ టచ్ బాగా కలిసే అవకాశం కనిపిస్తోంది. బన్నీకి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్‌ ను యూజ్ చేసుకుని.. ఆయన రోల్ ను భయపెట్టే రేంజ్ లో చూపించడం ఇంట్రెస్ట్ పెంచుతోంది.

By:  M Prashanth   |   12 Sept 2026 1:00 AM IST
రాకాలో అసలైన కిక్ అదే!
X

అల్లు అర్జున్ అంటేనే స్టైల్.. స్క్రీన్‌ పై ఆయన కనిపిస్తే చాలు ఒక స్పెషల్ వైబ్ వస్తుంది. ఇక అట్లీ అంటే మాస్ ఎలివేషన్స్‌ కు కేరాఫ్ అడ్రస్. ఆ ఇద్దరూ కలిస్తే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు రాకా మూవీలో బన్నీ లుక్, క్యారెక్టరైజేషన్ చూస్తే.. ఆ కాంబినేషన్‌ లో అసలైన కిక్ ఎక్కడుందో అర్థమవుతోందని నెటిజన్లు, అభిమానులు అంటున్నారు.

బన్నీని ఇప్పటివరకు చూసిన లుక్స్‌ కు పూర్తి భిన్నంగా రాకాలో చూపించబోతున్నారు. గుండుతో, తోడేలు తరహా గెటప్‌ లో కనిపించడంతో పాటు.. పొడవైన గోర్లతో భయపెట్టే మృగంలాంటి రూపాన్ని ఆ రోల్ కు ఇచ్చారు. ఆ లుక్ కోసం బన్నీ ఫుల్ గా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునట్లు సమాచారం. అంటే ఇక్కడ స్టైల్ అంటే కేవలం ఫ్యాషన్ కాదు.. పాత్రలో భాగమైన ఒక వైల్డ్ లుక్. అదే అట్లీ టచ్ అని చెప్పాలి.

హీరోకు ఒక స్పెషల్ గెస్చర్ ఇవ్వడం ఒక ఎత్తయితే.. దాన్ని స్క్రీన్‌ పై భారీగా ఎలివేట్ చేయడం మరో ఎత్తు. రాకా అంటే రాక్షసుడు అనే అర్థం వచ్చేలా టైటిల్ పెట్టడం.. ఒక రాక్షసుడికి పవర్స్ ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌ తో పాత్రను డిజైన్ చేయడం.. బన్నీని నార్మల్ యాక్షన్ హీరోగా కాకుండా ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ గా చూపించే ప్రయత్నంగా తెలుస్తోంది.

ఇక్కడ బన్నీ స్టైల్‌ కు అట్లీ మాస్ టచ్ బాగా కలిసే అవకాశం కనిపిస్తోంది. బన్నీకి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్‌ ను యూజ్ చేసుకుని.. ఆయన రోల్ ను భయపెట్టే రేంజ్ లో చూపించడం ఇంట్రెస్ట్ పెంచుతోంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌ తో బన్నీ ఎంట్రీ ఉండబోతుందనే టాక్ ఉంది. విలన్లు ఆయన క్యారెక్టర్ పేరు వింటేనే వణికిపోయేలా ఎలివేషన్ ఉండబోతున్నట్లు సమాచారం. అయితే సినిమాలో కేవలం మాస్ చూపిస్తే సరిపోదు.

సైన్స్ ఫిక్షన్ కథ కావడంతో బన్నీ పాత్రకు సంబంధించిన పవర్స్, విజువల్స్, యాక్షన్‌ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే బన్నీ స్టైల్‌ ను అట్లీ తన మాస్ ట్రీట్మెంట్‌ తో కలిపి.. దానికి వైల్డ్ క్యారెక్టరైజేషన్‌ ను యాడ్ చేసినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో రోల్ లో ఎమోషన్ కూడా మెయిన్. ఎంత పవర్‌ ఫుల్‌గా, ఎంత వైలెంట్ గా హీరోను చూపించినా.. ప్రేక్షకుడు ఆ రోల్ తో కనెక్ట్ కావాలి. బన్నీ తన యాక్టింగ్ తో ఎమోషన్‌ తీసుకురావాలి.

అట్లీ తన మార్క్ ఎలివేషన్స్‌తో దాన్ని స్ట్రాంగ్ గా చూపించాలి. అందుకే రాకా విషయంలో అసలైన కిక్ కథ మాత్రమే కాదు.. బన్నీ స్టైల్‌ ను అట్లీ తన మాస్ టచ్‌ తో ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడనే దాంట్లోనే ఉంది. ఒకవైపు బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్.. మరోవైపు అట్లీ ఎలివేషన్.. దానికి తోడు వైల్డ్ క్యారెక్టరైజేషన్.. ఆ మూడు కూడా కలిస్తే సిల్వర్ స్క్రీన్ పై వచ్చే కిక్ ఎలా ఉంటుందో చూడాలి.