Begin typing your search above and press return to search.

'రాకా'.. అట్లీ ప్లాన్ ఇక ఫాలో అయిపోతారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాకాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   4 Jun 2026 12:00 AM IST
రాకా.. అట్లీ ప్లాన్ ఇక ఫాలో అయిపోతారా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాకాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సిరీస్‌ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఈసారి మరింత హై రేంజ్ లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. హై బడ్జెట్‌ తో రూపొందుతున్న ఆ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. కథ పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందని, మూడు కాలాలకు చెందిన భిన్నమైన పాత్రలు ఆయన పోషించనున్నారని టాక్ వినిపిస్తోంది. అట్లీ తనదైన శైలిలో మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, భారీ యాక్షన్ సీన్స్ ను మిక్స్ చేస్తూ ఆ కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచగా, త్వరలో గ్లింప్స్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రాకా వరల్డ్ ను, విజువల్ స్కేల్‌ ను పరిచయం చేసేలా గ్లింప్స్ ఉండబోతున్నట్లు వినికిడి.

అయితే రాకా సినిమా విషయంలో ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్. ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు విడుదల తేదీలు వాయిదా వేయడానికి ప్రధాన కారణంగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యమే. ముఖ్యంగా గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ బేస్డ్ చిత్రాల్లో షూటింగ్ పూర్తయిన తర్వాత నెలల తరబడి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. దీంతో నిర్మాతలు, దర్శకులు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

కానీ రాకా టీమ్ విషయంలో స్పెషల్ ప్లాన్ ఫాలో చేస్తున్నట్లు సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా అవసరమయ్యే భారీ యాక్షన్ సీన్స్ ముందుగానే స్పెషల్ టెక్నికల్ టీమ్ తో షూట్ చేసి, వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ పనులు కూడా దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంటే హీరో లేదా మెయిన్ క్యాస్టింగ్ అవసరం లేని అనేక విజువల్ షాట్లను ముందుగానే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌ లో క్యాస్టింగ్ పై సీన్స్ ను షూట్ చేస్తున్నారని సమాచారం. ఆ తర్వాత వాటిని ముందే సిద్ధం చేసిన విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్ తో సింక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ప్రెజర్ బాగా తగ్గే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా ప్రొడక్షన్ విషయంలో ప్రీ ప్లాన్ ఎంత ముఖ్యమో ఆ విధానం మరోసారి చూపిస్తోంది.

నిజానికి భారీ చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్ కీ రోల్ పోషిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, షూటింగ్‌ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్యారలల్ గా ముందుకు తీసుకెళ్లడం ద్వారా టైమ్ సేవ్ అవుతుంది. అంతే కాదు అట్లీ ప్లాన్ సక్సెస్ అయితే.. అనేక మంది మేకర్స్ ఫ్యూచర్ లో ఫాలో అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా భారీ క్యాస్టింగ్, హై బడ్జెట్, అట్లీ- బన్నీ కాంబినేషన్, టెక్నికల్ గా కొత్త ప్రయోగాలతో రాకా ఇప్పటికే ఆసక్తిని పెంచుతోంది. ఆ ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో.. విడుదల తర్వాత సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.