నిరాశలో ఫ్యాన్స్.. 'రాకా' గురించి ఐకాన్‌స్టార్ అప్‌డేట్!
అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ మూవీ అప్‌డేట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే సినిమా గురించి అప్‌డేట్ ఇస్తామని ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ తెలిపారు. దర్శకుడు అట్లీ ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉండాలని చూస్తున్నారని, గ్లింప్స్ విడుదల చేస్తే అది ది బెస్ట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
By: Sivaji Kontham | 16 Nov 2026 9:45 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `రాకా` మూవీకి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకాభిమానుల ముందుకు ఎప్పుడు వస్తుంది? ..కొన్ని నెలలుగా ఫ్యాన్స్ లో ఒకటే ఉత్కంఠ. అయితే ఈ సినిమాని శిల్పంలా చెక్కుతున్నాడు అట్లీ. అందుకే అంతకంతకు ప్రతిదీ రహస్యంగా ఉన్నాయి. ఏదైనా అప్ డేట్ ఇవ్వాలనే ఉంది.. కానీ ఈసారి అప్ డేట్ ఇస్తే అది జనంలోకి బలంగా వెళ్లిపోవాలని బన్ని- అట్లీ బృందం భావిస్తున్నట్టు తాజా సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది.
`ఆకాశంలో ఒక తార` ప్రీరిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `రాకా` గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. వేదిక వద్ద ఉన్న అభిమానుల నుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ .. తొందర్లోనే రాకా అప్ డేట్ చెబుతామని వెల్లడించారు. అట్లీ ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఏదైనా గ్లింప్స్ ఇస్తే అది దూసుకెళ్లాలి.. అందుకే వెయిట్ చేస్తున్నామని కూడా అల్లు అర్జున్ తెలిపారు.
బన్ని మాటల్లోనే పరిశీలిస్తే...``రాకా గురించి త్వరలోనే ఒక అప్‌డేట్ ఇస్తాం. ఇప్పటికే చాలా ఆలస్యమైందని నాకు తెలుసు. కానీ మేం అప్‌డేట్ ఇచ్చినప్పుడు అది ది బెస్ట్‌గా ఉండాలి. ఆ తర్వాత దాని గురించి మరో చర్చకు తావుండకూడదు`` అని అన్నారు. ప్రేక్షకులతో పాటు `రాకా` నుంచి త్వరలోనే ఒక అప్‌డేట్ రావాలన్నది నా కల కూడా అని పేర్కొన్నారు. దీనిని బట్టి చిత్ర కథానాయకుడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
మొత్తానికి ఫిక్షన్ ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న `రాకా` చిత్రీకరణ దశలోనే గొప్ప క్యూరియాసిటీని పెంచింది. ఇప్పటికే క్రియేట్ అయిన హైప్ కి తగ్గట్టే చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని అర్థమవుతోంది. ప్రస్తుతం `రాకా` పేరుతో ఏఐ జనరేటెడ్ ట్రైలర్లు, గ్లింప్స్ బోలెడన్ని వీడియోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. బన్ని అభిమానులకు ఇది కొంత ఉపశమనం. అయితే వాటన్నిటినీ మించేలా ఒరిజినల్ గ్లింప్స్ ని రెడీ చేయడమే చిత్రబృందం ముందు ఉన్న పెను సవాల్. ఇటీవలి కాలంలో ఏఐ జనరేటెడ్ లేదా ఫ్యాన్స్ క్రియేటివిటీ ఒరిజినల్ ని కూడా డామినేట్ చేసేస్తున్నాయి. అందువల్ల రాబోవు టీజర్ లేదా గ్లింప్స్ క్రియేటివిటీ- క్వాలిటీ పరంగా అత్యుత్తమంగా ఉండాలి. దీనికోసమే రాకా టీమ్ కృషి చేస్తోందని భావించవచ్చు.
అయితే బన్ని టీమ్ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిరీక్షణ పెరిగేకొద్దీ అంచనాలు కూడా అదే స్థాయిలో ఆకాశాన్ని తాకుతాయి. నెలల తరబడి అభిమానులు ఎదురుచూస్తున్నందున.. వారిని నిరాశపరిచే అవకాశం చిత్రబృందానికి ఏమాత్రం లేదు. అంచనాలకు.. అసలు అప్‌డేట్‌కు మధ్య చిన్నపాటి తేడా ఉన్నా అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా జరగకూడదనే ఆశిద్దాం.
