Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ దీనికి ఒప్పుకుంటాడా?

ఈ ఏఐ యుగంలో సెలబ్రెటీల పేర్లను, ముఖాలను తమ ప్రయోజనాల కోసం వాడుకునేవాళ్లు పెరిగిపోయారు.

By:  Garuda Media   |   15 May 2026 1:00 PM IST
అల్లు అర్జున్ దీనికి ఒప్పుకుంటాడా?
X

ఈ ఏఐ యుగంలో సెలబ్రెటీల పేర్లను, ముఖాలను తమ ప్రయోజనాల కోసం వాడుకునేవాళ్లు పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సహా చాలామంది సినీ ప్రముఖులు.. ఇలాంటి వ్యవహారాలను నివారించడం కోసం కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు ఇలా చేయడంపై మొదట మిశ్రమ స్పందన వచ్చినా.. తర్వాత ఇది అవసరమే అన్న అభిప్రాయం విస్తృతంగా వినిపించింది. ఐతే ఇప్పుడు సన్ పిక్చర్స్ సంస్థ తీసుకున్న నిర్ణయంపై మాత్రం అల్లు అర్జున్ అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తోంది. బన్నీ కొత్త సినిమా ‘రాకా’ను సన్ పిక్చర్సే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రంలో బన్నీ క్యారెక్టర్ డైలాగ్స్, మేనరిజమ్స్, వైల్డ్ యాక్ట్స్‌ను ఎవ్వరూ అనుకరించకుండా కాపీ రైట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ఒక నటుడి పేరు, ఫేమ్‌ను వ్యక్తిగత-ఆర్థిక ప్రయోజనాలకు వాడుకోకుండా నివారించడం ఓకే కానీ.. ఇలా సినిమాలో సిగ్నేచర్ మూవ్స్‌ను అనుకరించకూడదు అనడం కరెక్టా అనే ప్రశ్న తలెత్తుతోంది.

బన్నీ చివరి చిత్రం ‘పుష్ప’లో ‘తగ్గేదే లే’ అంటూ బన్నీ ఇచ్చిన మేనరిజమ్.. అలాగే ‘శ్రీవల్లి’ పాటతో తన స్టెప్ ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. రీల్స్, షార్ట్స్‌ ద్వారా ఇవి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాయి. దీంతో సినిమాకు బాగా కలిసొచ్చింది. బన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఫేమ్ సంపాదించడానికి ఇవే కారణం. దేశ విదేశఆల్లో అంతర్జాతీయ క్రికెటర్లు, ఫుట్‌బాలర్లు సైతం బన్నీ మేనరిజమ్స్‌ను అనుకరించారు. ఇది అంతిమంగా తనకు ఎంతో మేలు చేసిందని బన్నీకి తెలియంది కాదు. బన్నీ ఇలాంటి పబ్లిసిటీని ఎంతో ఇష్టపడతాడు కూడా. అలాంటిది ఇప్పుడు ‘రాకా’లో తన మేనరిజమ్స్, యాక్ట్స్‌ను ఎవ్వరూ అనుకరించకుండా సన్ పిక్చర్స్ కాపీ రైట్ కోసం ప్రయత్నిస్తోందన్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ రోజుల్లో సినిమాల పాటలు, ఇతర మూమెంట్స్ మీద ఎన్ని రీల్స్, షార్ట్స్ వస్తే పబ్లిసిటీ పరంగా అంత ఉపయోగపడుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటే అది సినిమాకు చేటే అవుతుంది. మరి బన్నీ ఈ విషయంలో ఏం చేస్తాడో చూడాలి.