Begin typing your search above and press return to search.

బ‌న్నీ 'రాకా' హైద‌రాబాద్ కి ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం `రాకా` అనౌన్స్‌మెంట్ రోజే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది.

By:  Srikanth Kontham   |   23 Jun 2026 9:00 PM IST
బ‌న్నీ రాకా హైద‌రాబాద్ కి ఎప్పుడంటే?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం `రాకా` అనౌన్స్‌మెంట్ రోజే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. `పుష్ప`సిరీస్ తర్వాత బన్నీ న‌టిస్తోన్న ప్రాజెక్ట్ కావడంతో సినీ ప్రియులు అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వినూత్నమైన కథాంశంతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీగా నిలిచింది. తాజాగా `రాకా` షూటింగ్ విశేషాల్లోకి వెళితే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది.

మొదటి షెడ్యూల్ మొదలైనప్పటి నుండి చిత్ర యూనిట్ ముంబై పరిసర ప్రాంతాలలోనే సుదీర్ఘంగా చిత్రీకరణ జరుపుతోంది. సినిమాలోని కీలకమైన యాక్షన్ బ్లాక్స్, హై-వోల్టేజ్ డ్రామా సీన్లను ముంబై బ్యాక్‌డ్రాప్‌లోనే దర్శకుడు అట్లీ ఎంతో అద్భుతంగా చిత్రీక‌రిస్తున్న‌ట్లు సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన నాటి నుండి ముంబైలోనే నిరంతరాయంగా సాగుతుండటం, ఇప్పటి వరకు మరే ఇతర కొత్త లొకేషన్‌కు షిఫ్ట్ కాకపోవడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ న‌డుస్తోంది.

ఈ సినిమాకు హైదరాబాద్‌లో షూటింగ్ షెడ్యూల్ ఉంటుందా? ఉండ‌దా? మొత్తం ముంబై లొకేషన్స్ లోనే పూర్తి చేస్తారా? అన్న సందేహాలు అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ బలంగా వ్యక్తమవుతున్నాయి. పాన్-ఇండియా సినిమాలను ముంబైలోనే ఎక్కువగా పూర్తి చేసే ధోరణి ఉండటంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ ఉత్కంఠకు తెరదించుతూ `రాకా` సరికొత్త షెడ్యూల్‌కు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జులై ఆఖరి వారంలో హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభం కానుందని చిత్ర వర్గాల ద్వారా సమాచారం. దీంతో బన్నీ హైదరాబాద్ లొకేషన్స్‌లో ఎప్పుడు అడుగు పెడతారా? అని ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడినట్లయింది. హైదరాబాద్‌లో జరగబోయే ఈ షెడ్యూల్ సినిమాకు అత్యంత కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకోసం నగరంలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్లను కూడా నిర్మిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ముంబైలో పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ముగించుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్‌ షెడ్యూల్‌లో కొన్ని ముఖ్య మైన టాకీ పార్ట్స్, భావోద్వేగాలతో కూడిన కుటుంబ సన్నివేశాలను .. ప్రధాన తారాగణం మధ్య వచ్చే కీలక సీన్లను చిత్రీకరిం చనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ముంబై కోటను దాటి బన్నీ రాకా భాగ్యనగరంలో అడుగు పెడుతుండ‌టం బిజినెస్ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. జులై షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ కీలక దశకు చేరుకోనుందిట‌. ఐకాన్ స్టార్ సరికొత్త మేకోవర్, మేకింగ్ వాల్యూస్ ఈ చిత్రంలో ఏ రేంజ్‌లో ఉంటాయో? తెలియాలంటే రాబోయే రోజుల్లో మేకర్స్ వదిలే అఫీషియల్ గ్లింప్స్ ..టీజర్ వరకు వేచి చూడాల్సిందే.