'రాకా' మూవీలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ గా `రాకా` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 19 Aug 2026 11:39 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ గా `రాకా` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సినిమా మొదలైన నాటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా తాజాగా చిత్రానికి సంబంధించి హాలీవుడ్ నుంచి వస్తోన్న ఓ వార్త సినీ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హాలీవుడ్ స్టార్ `బ్యాడ్ బాయ్స్` ఫేమ్ విల్ స్మిత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గ్లోబల్ యాక్షన్ ఫ్లిక్‌లో విల్ స్మిత్ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారే వార్త ఆసక్తికరంగా మారింది. ఇదే నిజమైతే ఇండియన్ సినిమా చరిత్రలో హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్‌గా `రాకా` నిలుస్తుంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఈ సరికొత్త ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ గనుక సెట్టయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు బద్దలవడం ఖాయమని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ షెడ్యూల్స్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. విల్ స్మిత్ ప్రాజెక్ట్‌లో భాగమైతే? ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను విదేశీ లొకేషన్లలో తెరకె క్కించే అవకాశః ఉందని యూనిట్ వర్గాల నుంచి తెలుస్తోంది. సినిమాలలో విజువల్స్ - యాక్షన్ సీక్వెన్స్‌లను ఏ స్థాయిలో గ్రాండ్‌గా డిజైన్ చేస్తారో? ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా హాలీవుడ్ టెక్నీషియన్లు -నటులతో సినిమాను మరింత భారీ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వార్తలపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనని.. చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విల్ స్మిత్ ఉన్నా ? లేకపోయినా? ఈ సినిమాకు ఇప్పటికే హాలీవుడ్ టచ్ తగిలేసింది. ఈ సినిమాకు పనిచేస్తున్న టెక్నిషీయన్లు చాలా మంది హాలీవుడ్ నుంచి దిగుమతి అయిన వాళ్లే.
సైన్స్ ఫింక్షన్ కథ కావడంతో? అట్లీ వారితో మాత్రమే పనవుతుందని భావించి ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియోలోనే ప్రారంభించారు. అనంతరం అందుకు అనుగుణమైన హాలీవుడ్ టీమ్ నే షూటింగ్ కి కూడా ఎంచుకున్నారు. షూట్ మొదలైన నాటి నుంచి ముంబై వేదికగానూ షూటింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే హైదరాబాద్ షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం.
