Begin typing your search above and press return to search.

'రాకా'లో ఊహించని బాలీవుడ్ స్టార్ ఎంట్రీ!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’లో బాలీవుడ్ నటుడు గోవిందా కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే దక్షిణాది సినిమాలో ఆయనకు తొలి ఎంట్రీ అవుతుంది. అయితే గోవిందా పాత్రతో పాటు ఇతర నటీనటుల వివరాలపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.

By:  Srikanth Kontham   |   26 Nov 2026 2:17 PM IST
రాకాలో ఊహించని బాలీవుడ్ స్టార్ ఎంట్రీ!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న పాన్-ఇండియా చిత్రం `రాకా`పై రోజుకో అప్ డేట్ం చక్కర్లు కొడుతుంది. సైన్స్ ఫిక్షన్.. యాక్షన్ అంశాలతో తెరకెక్కుతోన్న సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా కీలక పాత్ర పోషిస్తున్నార‌న్న‌ది తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త నిజమైతే దక్షిణాది సినిమాల్లో గోవిందాకు ఇదే తొలి ఎంట్రీ అవుతుంది. ఈ చిత్రంలో గోవిందా పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా? కథ మలుపు తిరిగే సన్నివేశాల్లో ఆ పాత్ర ప్రభావవంతంగా ఉంటుందని సమాచారం.

చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న గోవిందా ఇలాంటి భారీ ప్రాజెక్ట్ ద్వారా మళ్లీ లైన‌మ్‌లైట్‌లోకి రావడం అభిమానులకు ఆసక్తి కలిగించే విషయమే. గతంలో `రంగీలా రాజా` తర్వాత పెద్ద తెరపై కనిపించని గోవిందా సొంతంగా నిర్మిస్తున్న హిందీ ప్రాజెక్టులతో పాటు తాజాగా `రాకా` వైపు కూడా అడుగులే స్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే `రాకా` తారాగణం విషయంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తుండగా, మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, రమ్యకృష్ణ వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. యోగి బాబు, జిమ్ సర్బ్ వంటి నటులు కూడా భాగమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో గోవిందా పాత్రతో పాటు ఇతర నటీనటుల వివరాలపై చిత్రబృందం ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

కథ పరంగా చూస్తే వేర్వేరు కాలాలు.. ప్రపంచాల నేపథ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది. వైదిక కాలం నాటి అంశాలతో పాటు వర్తమాన పరిస్థితులను ముడిపెడుతూ అట్లీ స్క్రిప్ట్‌ను మ‌లిచిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. దీపికా పాత్ర కూడా ఎమోషనల్‌గా.. సంఘర్షణతో కూడుకుని ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సాంకేతికంగానూ `రాకా` ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకేసారి 37 మంది కళాకారులతో రియల్-టైమ్ మోషన్ క్యాప్చర్ నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించ‌డం ప్రాజెక్ట్ స్కేల్‌ను సూచిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అన్ని ప‌నులు పూర్తి చేసి 2027లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రమోషనల్ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు డిసెంబర్ లో ఏదైనా సర్‌ప్రైజ్ దక్కే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అప్‌డేట్స్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో బ‌న్నీ కూడా అభిమానులను సంయమనంతో ఉం డమని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గోవిందా ఎంట్రీపై అధికారిక ప్రకటన వస్తుందా? లేదా? అన్నది చూడాలి.