Begin typing your search above and press return to search.

'రాకా' మీద ఇంత బరువు ఎందుకు?

ఆ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది కానీ, సినిమా స్టోరీ ఏంటి, బన్నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది లాంటి ప్రశ్నలకు ఆన్సర్ దొరకలేదు.

By:  M Prashanth   |   16 Aug 2026 10:26 AM IST
రాకా మీద ఇంత బరువు ఎందుకు?
X

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన కంటెంట్ చాలా తక్కువ. ఏప్రిల్ నెలలో టైటిల్ అనౌన్స్ చేస్తూ బన్నీ కొత్త లుక్ రిలీజ్ చేశారు. అందులో బట్టతల, నెరిసిన గడ్డం, డార్క్ మేకప్ తో బన్నీని చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. ఆ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది కానీ, సినిమా స్టోరీ ఏంటి, బన్నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది లాంటి ప్రశ్నలకు ఆన్సర్ దొరకలేదు. అందుకే రాబోయే ఫస్ట్ వీడియో మీద అందరి ఫోకస్ పడింది.

ఈ సినిమాకు కొత్తగా హైప్ తీసుకురావాల్సిన పనే లేదు. అటు 'పుష్ప 2' లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా. ఇటు 'జవాన్' తో బాలీవుడ్ ను షేక్ చేసిన అట్లీ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్. కాబట్టి క్రేజ్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోయింది. ఫస్ట్ లుక్ చూశాక ఇందులో బన్నీది నెగెటివ్ క్యారెక్టరా లేక డార్క్ షేడ్స్ ఉంటాయా అనే క్యూరియాసిటీ జనాల్లో బాగా పెరిగిపోయింది.

ఫస్ట్ గ్లింప్స్ లేదా టీజర్ లో కేవలం హీరో ఎలివేషన్ షాట్స్ చూపిస్తే సరిపోదు. అట్లీ ఈ సినిమా కోసం ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించాడనేది కనీసం చిన్న హింట్ అయినా ఇవ్వాలి. పైగా రాకా ఒక భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంత పెద్ద కాన్సెప్ట్ ఉన్నప్పుడు జస్ట్ పోస్టర్ తో మేజిక్ చేయలేరు. విజువల్స్ పడితేనే సినిమా స్కేల్ ఏంటో జనాలకు కనెక్ట్ అవుతుంది.

పుష్పరాజ్ క్యారెక్టర్ జనాల మైండ్ లో ఎంత గట్టిగా ముద్ర వేసిందో అందరికీ తెలుసు. ఆ బాడీ లాంగ్వేజ్ ను బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. రాకా ఫస్ట్ లుక్ దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంది. ఇప్పుడు రాబోయే వీడియోలో బన్నీ వాయిస్, నడిచే తీరు, యాటిట్యూడ్ అన్నీ కొత్తగా కనిపిస్తేనే ఆ మార్పు ఆడియన్స్ కు సింక్ అవుతుంది. పుష్ప ఇమేజ్ నుంచి బయటపడటానికి బన్నీకి ఇదే కరెక్ట్ టెస్ట్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫాస్ట్ గానే జరుగుతోంది. ఆగస్టులోనే ఒక స్పెషల్ గ్లింప్స్ వస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నా, మేకర్స్ నుంచి అఫీషియల్ డేట్ రాలేదు. ఇందులో దీపికతో పాటు రష్మిక మందన్న కూడా ఒక పాత్రలో నటిస్తోంది. ఇక రాకా నుంచి నెక్స్ట్ వచ్చే వీడియో యూట్యూబ్ రికార్డుల కోసమే కాదు. అసలు ఆ టైటిల్ కు అర్థం ఏంటి, ఆ షాకింగ్ లుక్ వెనక ఉన్న క్యారెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలపై క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటిదాకా రాకా చుట్టూ ఉన్న మిస్టరీ జనాల్లో బాగానే వర్కవుట్ అయింది. ఇక వీడియో వదిలినప్పుడు ఆ క్యూరియాసిటీని ఇంకా పెంచుతారా లేక కథపై ఒక క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి.