'అవతార్'తో 'రాకా' పోలిక.. రాజమౌళితో అట్లీ పోలిక.. ఒప్పుకుంటారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ యాక్షన్ డ్రామా `రాకా`. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
By: Sivaji Kontham | 19 Sept 2026 9:35 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ యాక్షన్ డ్రామా `రాకా`. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. చాలా కాలంగా ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఒక క్రేజీ అప్‌డేట్ రానుండగా.. తాజాగా తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి ఈ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల ఓ కార్యక్రమంలో సిబి చక్రవర్తి మాట్లాడుతూ.. ``అట్లీ సర్ ఇండియన్ సినిమా గర్వపడేలా ఒక సినిమా చేస్తున్నారు. ఆయన నాకు చూపించిన విజువల్స్ చూసి ఆశ్చర్యపోయాను. అలాంటి అద్భుతమైన విజువల్స్‌ను నేను `అవతార్` సినిమాలో కూడా చూడలేదు. ఆ విజువల్స్ ఎలాంటివో మీ అందరికీ మరో మూడు రోజుల్లో చూస్తారు. ఇది అద్భుతంగా ఉంది. రాజమౌళి సర్ ఏ విధంగా అయితే ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారో.. అదే రీతిలో అట్లీ సర్ `రాకా`తో ఇండియన్ సినిమాను గ్లోబల్ మ్యాప్‌లో నిలపబోతున్నారు`` అంటూ ఆకాశానికి ఎత్తేశారు. `అవతార్`ను మించిన అనుభూతిని `రాకా` ఇస్తుందని ఆయన చేసిన ఈ స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు రాజమౌళితో పోలుస్తూ అట్లీని అతడు ఆకాశానికెత్తేయడంపైనా ఫ్యాన్స్‌లో బోలెడంత చర్చ జరుగుతోంది.
అయితే `అవతార్`తో `రాకా`ను పోల్చడం, రాజమౌళి రేంజ్‌లో అట్లీని ప్రశంసించడం వంటి విషయాలపై టైమింగ్ కరెక్టేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం అతిశయోక్తిగా మిగలకూడదు అంటే మాస్ డైరెక్టర్ అట్లీ తనలోని వైవిధ్యాన్ని చాటుకోవాల్సిన సమయం వచ్చింది. అట్లీ గత చిత్రం `జవాన్` భారీ వసూళ్లను సాధించినా క్రిటిక్స్ ని మెప్పించడంలో విఫలమైంది. అది కేవలం షారుఖ్ బ్రాండ్‌తోనే ఆడిందనే విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు `పుష్ప` ఫ్రాంఛైజీతో గ్లోబల్ స్థాయిలో సంచలనాలు సృష్టించిన అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నందున.. అట్లీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో `రాకా` టీజర్ -ట్రైలర్ దశ నుంచే సినిమా సత్తా ఎంత ఉందనేది క్రిటిక్స్ విశ్లేషిస్తారు కాబట్టి అట్లీ అన్ని విమర్శలను లేదా ప్రశంసలను అందుకునేందుకు మానసికంగా ప్రిపేర్ కావాల్సిందే. ఫాంటసీ యాక్షన్ డ్రామా జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌తోనే తన హైలెవల్ మేకింగ్‌ను చాటుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏదైనా నచ్చితే క్రిటిక్స్ నెత్తిన పెట్టుకుంటారు. నచ్చకపోతే దానిని కచ్ఛితంగా విమర్శిస్తారు. అన్నిటికీ అట్లీ టీమ్ సిద్ధంగా ఉండాలి.
మరి అట్లీ ఈ సినిమాతో ఇండియాలో కచ్చితంగా ఆధారపడదగ్గ పాన్ వరల్డ్ డైరెక్టర్ అని నిరూపించుకుంటారా లేదా అనేది చూడాలి. సన్ పిక్చర్స్ ఈ సినిమాకోసం వందల కోట్ల పెట్టుబడుల్ని సమకూర్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సర్వ శక్తుల్ని ఒడ్డి ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ ఫలించాలని ఆకాంక్షిద్దాం. విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. అట్లీ-బన్నీ కాంబోలో వస్తున్న ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి ఇంకా కొంత సమయం ఉన్నా కానీ.. ఎగసిపడుతున్న భారీ అంచనాల నడుమ `రాకా` ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
