Begin typing your search above and press return to search.

జ‌పాన్ అభిమానుల ఆతిథ్యానికి ఐకాన్ ఫ్యామిలీ స్ట‌న్!

అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ప్రైవేట్ ట్రిప్‌లో భాగంగా జ‌పాన్ రాజ‌ధాని టోక్యో వెళ్లారు. అక్కడ ఒక సుషీ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు స్టాఫ్ పుష్ప‌రాజ్‌ను గుర్తుపట్టి ప్రత్యేకంగా స్వాగతం పలికారు.

By:  Sivaji Kontham   |   26 Jan 2026 8:45 AM IST
జ‌పాన్ అభిమానుల ఆతిథ్యానికి ఐకాన్ ఫ్యామిలీ స్ట‌న్!
X

పుష్ప క్రేజ్ స‌రిహ‌ద్దులు దాటించింది. దేశ విదేశాల‌లో అల్లు అర్జున్ పేరు మార్మోగ‌డానికి కార‌ణ‌మైంది.




ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు ఖండాలు దాటి జపాన్‌కు కూడా పాకిందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. `పుష్ప` సినిమాతో గ్లోబల్ లెవల్‌లో అత‌డు సంపాదించుకున్న గుర్తింపు సామాన్యమైంది కాదు.




అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ప్రైవేట్ ట్రిప్‌లో భాగంగా జ‌పాన్ రాజ‌ధాని టోక్యో వెళ్లారు. అక్కడ ఒక సుషీ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు స్టాఫ్ పుష్ప‌రాజ్‌ను గుర్తుపట్టి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. కేవలం గుర్తుపట్టడమే కాకుండా అత‌డికి ఇష్టమైన వంటకాలతో పాటు `పుష్ప` సినిమాకు సంబంధించిన డెజర్ట్‌ను,స్పెషల్ గెస్టర్‌ను ప్రెజెంట్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ముఖ్యంగా జ‌పనీ అభిమానులు బ‌న్నీని రిసీవ్ చేసుకున్న తీరు ఆక‌ట్టుకుంది.




జపాన్ ప్రజలకు ఇండియన్ సినిమాలంటే మక్కువ ఎక్కువే. ముఖ్యంగా రజనీకాంత్, ప్ర‌భాస్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్ల‌ను జ‌ప‌నీలు అమితంగా ఆరాధిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ `పుష్ప` మేనరిజమ్స్ అక్కడ బాగా వైరల్ అయ్యాయి. జపాన్ అభిమానులు ఆయన డ్యాన్స్‌ స్టెప్పులను ..తగ్గేదే లే! సిగ్నేచర్ స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ వీడియోలు కూడా సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు.




సౌత్‌లో ఒక సాధార‌ణ హీరోగా మొద‌లై గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. `పుష్ప: ద రైజ్` తో నేషనల్ అవార్డ్ గెలుచుకుని పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ, ఇప్పుడు గ్లోబల్ ఐకాన్‌గా మారుతున్నారు. జపాన్ వంటి దేశాల్లో అత‌డికి లభిస్తున్న ఈ ఆదరణ అత‌డిలో మ‌రింత ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపుతుంద‌న‌డంలో సందేహం లేదు.

అక్క‌డ రిలీజ్ ఎప్పుడు?

జపాన్‌లో `పుష్ప 2` చిత్రం ఇప్ప‌టికే జ‌పాన్ లో విడుద‌లైంది. జపాన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ చిత్రాన్ని నేరుగా జపనీస్ భాషలోకి డబ్ చేసి విడుదల చేసారు. జ‌పాన్ లో అల్లు అర్జున్ కి ఫాలోయింగ్ ని పెంచ‌డంలో పుష్ప‌రాజ్ స‌క్సెసైంద‌ని తాజా ప‌రిణామం చెబుతోంది.

భారతదేశం స‌హా ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో `పుష్ప 2` ఇప్పటికే 5 డిసెంబర్ 2024న విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మ‌రోవైపు అల్లు అర్జున్ న‌టించ‌బోతున్న `పుష్ప 3` గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో దేశ విదేశాల‌లో పెరుగుతున్న అభిమానం బ‌న్నీకి అన్నివిధాలా క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

రియ‌ల్ ఫ్యామిలీమ్యాన్ బ‌న్ని:

సినిమా షూటింగ్స్, ప్రమోషన్ల హడావుడి నుంచి కాస్త విరామం తీసుకుని తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి అల్లు అర్జున్ జపాన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అక్కడ కూడా అత‌డు ఫేమ్ వదలకపోవడం విశేషం.

జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌ను ముగించి అల్లు అర్జున్ త్వరలో ఇండియా తిరిగి రానున్నారు. త‌దుప‌రి అట్లీ సినిమా పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ల‌ను ముగించి, బ‌న్ని త‌దుప‌రి త్రివిక్ర‌మ్, సందీప్ వంగా, సుకుమార్ వంటి వారితో సినిమాల గురించి చ‌ర్చిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్ర‌మ్ సినిమాపై బ‌న్ని ఫోక‌స్ చేస్తార‌ని స‌మాచారం.