ఐకాన్ స్టార్ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడా?
ఇదే ఫార్ములా ఇండస్ట్రీ అంతటా పాకితే పారితోషికాలు పక్కన పెట్టి ప్రతి ఒక్క హీరో సినిమా లాభాల్లో వాటాలు అడగడం మొదలు పెట్టే అవకాశం ఉందని, ఇది ఇండస్ట్రీని సమూలంగా మారుస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
By: Tupaki Entertainment Desk | 7 Feb 2026 3:00 PM IST`పుష్ప 2` మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఊహించని స్థాయికి చేరింది. ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన బన్నీ దీంతో ఇండియన్ సినిమాల్లో వన్ ఆఫ్ ది క్రేజీ స్టార్లలో ఒకడిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మూవీతో బన్నీ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. అప్పటి వరకు పారితోషికం తీసుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ ఈ మూవీ నుంచి లాభాల్లో వాటా అనే సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. ఇది ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త ఒరవడికి నాంది పలుకున్నట్టుగా తెలుస్తోంది.
`పుష్ప 2` థియేట్రికల్ బిజినెస్ అంచనా దాదాపు రూ.1000 కోట్లు. అందులో బన్నీ తన పారితోషికం కింద 27 శాతం తీసుకున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. అంతే ఈ ఒప్పందం కారణంగా పర్సెంటేజ్ విధానంలో బన్నీకి దక్కిన మొత్తం అక్షరాలా రూ.270 కోట్లు అన్నమాట. ఈ భారీ మొత్తంలో పారితోషికం దక్కించుకున్న ఇండియన్ యాక్టర్లలో బన్నీ మొదటి వాడిగా నిలవడం గమనార్హం. ప్రస్తుతం ఇది ఇండియన్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బన్నీ మొదలు పెట్టిన ఈ కొత్త ట్రెండ్ ఇండియన్ సినిమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
బన్నీ మొదలు పెట్టిన విధానం భారీ స్థాయి ఓపెనింగ్‌లు, రికార్డు స్థాయి ప్రీరిలీజ్ బిజినెస్, గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుని సినిమాకు భారీ వసూళ్లని రాబట్టగల హీరోలకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని, వారి స్టాడ్ డమ్‌కున్న సత్తాని తెలియజేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ కొత్త విధానం వల్ల భారీ చిత్రాలు నిర్మించే ప్రొడ్యూసర్స్‌కు ఆర్థికపరమైన వొత్తిడి పెద్దగా ఉండదని, అదే సమయంలో హీరోలకు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అధిక మొత్తంలో లాభాల్ని దక్కించుకునే వీలుంటుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్నా భారీ పాన్ వరల్డ్ మూవీకి కూడా ఇదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాడని, ఈ సినిమాకు కూడా పారితోషికం కాకుండా లాభాల్లో వాటాని తీసుకుంటున్నాడని, ఇందులో భాగంగా 27 నుంచి 30 శాతం మధ్య డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే బన్నీ ఫార్ములాని ఇకపై ప్రతీ హీరో ఫాలో అవ్వడం ఖాయం అనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ పద్దతి ద్వారా భారీ సినిమాల కారణంగా హీరోలు అత్యధిక శాతం లాభాల్ని ఆర్జించే అవకాశం ఉంది.
ఇదే ఫార్ములా ఇండస్ట్రీ అంతటా పాకితే పారితోషికాలు పక్కన పెట్టి ప్రతి ఒక్క హీరో సినిమా లాభాల్లో వాటాలు అడగడం మొదలు పెట్టే అవకాశం ఉందని, ఇది ఇండస్ట్రీని సమూలంగా మారుస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఇది కేవలం సక్సెస్ రేట్‌ని బట్టి మాత్రమే సక్సెస్ అవుతుందని, భారీ మార్కెట్‌ని క్రియేట్ చేయడమే కాకుండా అదే స్థాయిలో సినిమాల బిజినెస్‌ని, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకర్షించగలిగే హీరోల సామర్థ్యం, సమర్థతపై ఆధారపడి వుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
