రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'రామాయణ: పార్ట్ 1' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది.
By: Madhu Reddy | 4 Nov 2026 4:59 PM ISTభారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'రామాయణ: పార్ట్ 1' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ వండర్ నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో చేసిన ప్రత్యేక పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఇప్పుడు చూద్దాం..
‘ఇది కేవలం సినిమా కాదు.. సంస్కృతికి ప్రతిబింబం!:
రామాయణం సినిమాపై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. "ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. మన సంస్కృతికి ప్రతిబింబం మరియు భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరింత పెంచే ఒక గొప్ప ప్రయత్నం" అని బన్నీ కొనియాడారు. ఇక మన ప్రాచీన కథలను, సంస్కృతిని, భారతీయ వైభవాన్ని ముందడుగు వేయించే ఇలాంటి దివ్యమైన ప్రయత్నానికి సినీ ప్రేమికులందరం కలిసికట్టుగా అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.
థ్యాంక్స్ చెప్పిన డైరెక్టర్ నితీశ్ తివారీ:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఈ పాజిటివ్ పోస్ట్‌పై 'రామాయణ' చిత్ర దర్శకుడు నితీశ్ తివారీ వెంటనే స్పందించారు. అల్లు అర్జున్ అందించిన మద్దతుకు, తెలిపిన శుభాకాంక్షలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక పాన్-ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ చూపించిన ఈ అభిమానం మరియు ప్రోత్సాహం తమ చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి:
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటీనటుల ఎంపిక మొదటి నుంచీ విపరీతమైన క్రేజ్‌ను సంతరించుకుంది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, నాచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతాదేవి పాత్రలో ఒదిగిపోయారు. ఇక కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా పవర్‌ఫుల్ పాత్రను పోషించారు. ఇక వీరి కాంబినేషన్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి.
నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్:
ఎంతో కాలంగా చిత్రసీమతో పాటు సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రామాయణ: పార్ట్ 1' నవంబర్ 5,న బిగ్ స్క్రీన్లను పలకరించనుంది. ఇక హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తుందని పరిశ్రమ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక మొత్తానికి చూస్తే, రణ్‌బీర్-సాయిపల్లవిల ‘రామాయణ’ చిత్రానికి అల్లు అర్జున్ తెలిపిన మద్దతు సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక మన సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టేలా రూపొందిన ఈ అద్భుత కావ్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
