Begin typing your search above and press return to search.

బన్నీ, డార్లింగ్.. టాప్ స్టార్ ఎవరు?

టాలీవుడ్‌ లో టాప్ స్టార్ ఎవరు? అనే చర్చ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న హీరోల విషయంలో ఆ చర్చ మరింత వేడెక్కుతుంది.

By:  M Prashanth   |   16 March 2026 10:53 AM IST
బన్నీ, డార్లింగ్.. టాప్ స్టార్ ఎవరు?
X

టాలీవుడ్‌ లో టాప్ స్టార్ ఎవరు? అనే చర్చ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న హీరోల విషయంలో ఆ చర్చ మరింత వేడెక్కుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు ఇద్దరివే.. ఒకటి అల్లు అర్జున్.. మరొకటి ప్రభాస్.. ఆ ఇద్దరూ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఎవరు టాప్ హీరో అన్న ప్రశ్న మరోసారి ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా సినిమాలతో తన మార్కెట్‌ ను విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రస్తుతం ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్న కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న ఆ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశముందని సమాచారం. ఆ చిత్రంతో అల్లు అర్జున్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన రేంజ్ ఏంటో చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇదే కాకుండా, ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఒక భారీ యాక్షన్ చిత్రానికి సిద్ధమవుతున్నారు. లోకేష్ సినిమాలకు ఉన్న ప్రత్యేకమైన స్టైల్ దృష్ట్యా ఆ ప్రాజెక్ట్‌ పై కూడా భారీ ఆసక్తి నెలకొంది. ఆ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశముందని టాక్. ఆ రెండు సినిమాలకే కాకుండా, అల్లు అర్జున్ లైనప్‌ లో మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్టులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే యాక్షన్ సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాలపై త్వరలో అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రభాస్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఆయన చేతిలో అనేక భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే భారీ ప్రాజెక్ట్‌ లో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇవే కాకుండా ప్రభాస్ లైనప్‌ లో మరిన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్ కూడా ప్రభాస్ చేయనున్నారు. అలాగే సలార్ చిత్రానికి సీక్వెల్‌ ను కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌ తో రూపొందనున్నాయి. ఇలా చూస్తే ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అధికారికంగా నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ వద్ద అధికారికంగా రెండు సినిమాలు ఉండగా, మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరు టాప్ హీరో అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టమే! ఇద్దరు హీరోలకు పాన్ ఇండియాలో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. వరుసగా భారీ సినిమాలు చేస్తూ తమ తమ మార్కెట్‌ ను విస్తరించుకుంటున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు కనిపించినప్పటికీ, ఇద్దరికీ వారి ప్రత్యేక స్థానం టాలీవుడ్‌ లో కొనసాగుతూనే ఉందని చెప్పాలి.