Begin typing your search above and press return to search.

కెరీర్ పీక్స్‌ లో ఉండగా పొలిటికల్ ఎంట్రీనా? అసలు విషయమిదే..

అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు తాజాగా ఆయన టీమ్ నుంచి ఫుల్ క్లారిటీ వచ్చింది.

By:  M Prashanth   |   24 July 2026 11:00 AM IST
కెరీర్ పీక్స్‌ లో ఉండగా పొలిటికల్ ఎంట్రీనా? అసలు విషయమిదే..
X

సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం కొత్త విషయం కాదు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వరకు తెలుగు రాష్ట్రాలు అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశాయి. తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీ స్థాపించడంతో ఇప్పుడు మరో స్టార్ పేరు కూడా తరచూ వినిపిస్తోంది. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు తాజాగా ఆయన టీమ్ నుంచి ఫుల్ క్లారిటీ వచ్చింది.

గత కొంతకాలంగా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన మామయ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కావడం, ఇటీవల రాజకీయాలపై సినీ వర్గాల్లో పెరిగిన చర్చలతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. కొందరు అయితే అల్లు అర్జున్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెడతారని, ఫ్యామిలీ ద్వారా ఆయనకు పొలిటికల్ ఎంట్రీ ఈజీ అవుతుందని కూడా ప్రచారం చేశారు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు రీసెంట్ గా రెస్పాండ్ అయ్యారు. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని తాను ఇప్పటికే ఖండించానని తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని శరత్ చంద్ర నాయుడు చెప్పారు. ఇప్పుడు ఇండియాలోనే అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరోల్లో ఆయన ఒకరని చెప్పుకొచ్చారు.

ఇలాంటి సమయంలో సినిమాలను పక్కనబెట్టి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ముఖ్యంగా ఆయన కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ుఁదని ఉందని, వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం భారీ చిత్రాలు ఉన్నాయని, రాబోయే పదేళ్ల వరకు ఆయన షెడ్యూల్ దాదాపు సినిమాలతోనే నిండిపోయిందని ఆయన తెలిపారు.

అలాంటి పరిస్థితుల్లో రాజకీయాల గురించి ఆలోచించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే, మామయ్య ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారనే వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, తమిళ స్టార్ విజయ్ కూడా తమిళనాడు సీఎంగా వ్యవహరిస్తున్నారు.

దీంతో ఇతర స్టార్ హీరోలపై కూడా ఇలాంటి ప్రచారం జరగడం సహజంగా మారింది. అయితే అల్లు అర్జున్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పుష్ప సిరీస్‌ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ లో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరిగా నిలిచారు. ఇలాంటి సమయంలో రాజకీయాల కంటే సినీ కెరీర్‌ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు ఆయన టీమ్ స్పష్టం చేసింది. అలా ఐకాన్ స్టార్ పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారానికి ఆయన మేనేజర్ ఫుల్ స్టాప్ పెట్టినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ అడుగులు సినిమాల వైపే ఉన్నాయని, రాజకీయాల వైపు కాదని మరోసారి క్లారిటీ వచ్చింది.