చరణ్ పెద్ది పై అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నారంటే..
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది.
By: M Prashanth | 9 Jun 2026 12:08 PM ISTదర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమాను చూసిన సినీ ప్రముఖులు వారి పాజిటివ్ రెస్పాన్స్ తో మరింత హైప్ పెంచుతున్నారు. ఇక ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన వెంటనే బన్నీ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు. చిత్ర యూనిట్ తో పాటు హీరో రామ్ చరణ్ నటనపై రివ్యూ ఇచ్చారు.
నిన్న రాత్రి పెద్ది సినిమా చూశానని చెబుతూ రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. చరణ్ యాక్టింగ్ చాలా రస్టిక్ గా ఉందని, సినిమాలో అతని బాడీ ట్రాన్స్ఫర్మేషన్, గ్రేస్ ఫుల్ డాన్స్ మూమెంట్స్ అద్భుతంగా ఉన్నాయని అభినందించారు. ప్రతి విషయంలో చరణ్ ది బెస్ట్ ఇచ్చాడని చెబుతూ.. తన బ్రదర్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, ప్రేక్షకుల ప్రశంసలకు అతను పూర్తిగా అర్హుడని ట్వీట్ లో పేర్కొన్నారు.
చరణ్ తో పాటే సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించిన నటీనటుల గురించి కూడా అల్లు అర్జున్ ప్రస్తావించారు. సినిమాలో జగపతిబాబు గారు స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని కొనియాడారు. ఇతర నటీనటులందరి యాక్టింగ్ బాగుందని చెబుతూ.. ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ గా చేసిన హీరోయిన్ జాన్వీ కపూర్ కు తన ప్రత్యేకమైన ప్రేమను తెలియజేశారు.
ఈ సినిమా కోసం తెర వెనుక కష్టపడిన టెక్నికల్ టీమ్ తో పాటు నిర్మాతలకు అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ బుచ్చిబాబు సానాకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. సినిమాలో ప్రతి ఒక్కరినీ చాలా బాగా ఎలివేట్ చేశారని, ముఖ్యంగా రామ్ చరణ్ గారిని ఒక అత్యున్నత స్థాయిలో ప్రెజెంట్ చేశారని దర్శకుడి పనితీరును అల్లు అర్జున్ మెచ్చుకున్నారు.
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాను మరో స్టార్ హీరో మెచ్చుకుంటే ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ వాతావరణం కనిపిస్తుంది. పెద్ది లాంటి భారీ బడ్జెట్ సినిమాకు లాంగ్ రన్ చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న హీరో నుంచి పాజిటివ్ రివ్యూ రావడం చిత్ర యూనిట్ కు కచ్చితంగా కలిసొచ్చే అంశమే.
ఇప్పటికే కోస్తాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంతో సినిమాకు వసూళ్లు నిలకడగా వస్తున్నాయి. ఓపెనింగ్స్ పరంగా సత్తా చాటిన ఈ చిత్రం వీకెండ్ తర్వాత కూడా స్ట్రాంగ్ గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టైమ్ లో చరణ్ సినిమాకు అల్లు అర్జున్ వంద శాతం సపోర్ట్ ఇవ్వడం ఇరు వర్గాల అభిమానుల్లో జోష్ నింపుతోంది. సోషల్ మీడియాలో వచ్చిన ఈ బజ్ థియేటర్ల దగ్గర ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
