Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ OG రివ్యూ ఇస్తాడా..?

పవర్ స్టార్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ ని ఇష్టపడే వారందరికీ ఓజీ సినిమా బాగా ఎక్కేసింది.

By:  Ramesh Boddu   |   27 Sept 2025 10:52 AM IST
అల్లు అర్జున్ OG రివ్యూ ఇస్తాడా..?
X

పవర్ స్టార్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ ని ఇష్టపడే వారందరికీ ఓజీ సినిమా బాగా ఎక్కేసింది. ఇప్పటికే ఓజీ సినిమాను సెలబ్రిటీస్ అంతా చూసి తమ కామెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రిలీజ్ ఫస్ట్ షోనే మెగా హీరోలైన వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఓజీ సినిమా చూసి హంగామా చేశారు. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా, ఆద్యలు కూడా సినిమా చూశారు. పవన్ కళ్యాణ్ ఓజీని ఎందుకో ఫ్యాన్స్ చాలా ఓన్ చేసుకున్నారు. రిలీజ్ ముందు కూడా ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అనేలా చెప్పుకొచ్చారు.

ఓజీ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

సుజిత్ ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం డిజప్పాయింట్ చేయలేదు. ఐతే మిగతా ఆడియన్స్ మాత్రం సినిమా గురించి మిశ్రమ స్పందన ఇస్తున్నారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చూశారు. ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేశారు. మహేష్ ఏ.ఎం.బి మాల్ లో ఓజీ సినిమా చూశారు అల్లు అర్జున్. దీనికి సంబందించిన వీడియోస్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి చూడటం ఇక్కడ డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఇంతకీ ఓజీ సినిమా అల్లు అర్జున్ కి నచ్చిందా.. ఓజీ సినిమా గురించి అల్లు అర్జున్ రివ్యూ ఇస్తాడా అంటూ చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత అల్లు అర్జున్ కి పవర్ స్టార్ అన్నా కూడా అంతే ఇష్టం. ఐతే కొన్ని కారణాల వల్ల ఈమధ్య వాళ్ల మధ్య దూరం పెరిగింది.

అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్..

ఐతే ఇప్పుడు ఆ దూరం దగ్గరైందని తెలుస్తుంది. అంతేకాదు ఈమద్యనే అల్లు అర్జున్ నాయనమ్మ కాలం చేస్తే ఓదార్చేందుకు పవన్ కళ్యాణ్ వచ్చారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఉన్న ఫోటోలు ఆమధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య ఏం జరిగినా సరే ఆ బంధం అలానే ఉంది.. ఉంటుంది కూడా.

ఓజీ సినిమాపై ఏర్పడిన బజ్ చూసి అల్లు అర్జున్ కూడా సినిమా చూసేశారు. ఏదో సైలెంట్ గా తన ఏ.ఏ.ఏ మాల్ లో చూడొచ్చు కానీ ప్రత్యేకంగా మహేష్ ఏ.ఎం.బి మాల్ కి వెళ్లి ఆ సినిమా ఎక్స్ పీరియన్స్ అయ్యారు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సినిమా చూడటం ఒక క్రేజీ మూమెంట్ అయితే.. అది మహేష్ ఏ.ఎం.బి మాల్ లో చూడటం మరో ఇంట్రెస్టింగ్ థింగ్ గా మారింది. మరి ఓజీ సినిమాపై అల్లు అర్జున్ రెస్పాన్స్ ఏంటి..? బన్నీ బాయ్ కి పవర్ స్టార్ స్టైలిష్ మేకోవర్ ఎలా అనిపించింది అన్నది సోషల్ మీడియాలో ఎక్స్ ప్రెస్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.