ఐకాన్ స్టార్ నిర్ణయం..షాక్ తగిలేది ఎవరికి?
అలాంటి డైరెక్టర్‌తో బన్నీ సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. శక్తిమాన్ తరహాలో సాగే స్టోరీతో దీన్ని పాన్ ఇండియా మూవీకి మించి తెరపైకి తీసుకురానున్నారట.
By: Ravindar Gorantla | 5 March 2026 8:15 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. `పుష్ప 2`తో పాన్ ఇండియా వైడ్‌గా భారీ క్రేజ్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా ప్రభాస్ తరువాత అత్యధిక వసూళ్లని రాబట్టిన హీరోగా రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ అందించిన బ్లాక్ బస్టర్ జోష్‌తో ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయి మూవీ చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. బాలీవుడ్ క్రేజీ లేడీ దీపికా పదుకునే తో పాటు రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటిస్తోంది.
మరో ఇద్దరు క్రేజీ హీరోయిన్‌లు కూడా ఇందులో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే టీమ్ మాత్రం ఇంత వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే బన్నీ సూపర్ హీరో తరహా క్యారెక్టర్‌ని అట్లీ మూవీలో చేస్తూనే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. `కూలీ` మూవీతో భారీ స్థాయిలో ప్రేక్షకుల్ని నిరాశపరిచిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తదుపరి ప్రాజెక్ట్‌కు బన్నీ ఓకే చెప్పాడు. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఈ ప్రాజెక్ట్‌ని ఈ ఏడాదే పూర్తి చేస్తారు. రాకెట్ స్పీడుతో సినిమాని పూర్తి చేసి బన్నీ మరో ప్రాజెక్ట్ కు టైమ్ కేటాయించబోతున్నాడు. ఇప్పటికే AA22 నుంచి AA24 వరకు క్రేజీ లైనప్‌ని సెట్ చేసుకున్న ఐకాన్ స్టార్ ఈ జాబితాలో మలయాళ నటుడు, డైరెక్టర్ బాసిల్ జోసఫ్ మూవీని కూడా చేర్చేశాడు. `మిన్నల్ మురళి` పేరుతో రూపొందిన సూపర్ హీరో మూవీతో బాసిల్ జోసెఫ్ జాతీయ స్థాయిలో పాపులర్ అయిన విషయం తెలిసిందే. రాజమౌళి సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
అలాంటి డైరెక్టర్‌తో బన్నీ సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. శక్తిమాన్ తరహాలో సాగే స్టోరీతో దీన్ని పాన్ ఇండియా మూవీకి మించి తెరపైకి తీసుకురానున్నారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని బన్నీ హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ నిర్మించనుందని తెలిసింది. ఇప్పటికే స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చేసిన బాసిల్ జోసెఫ్ ప్రస్తుతం పూర్తిస్థాయి స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నాడట. అయితే ఈ నేపథ్యంలోనే స్టార్ డైరెక్టర్‌కు బన్నీ షాక్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. బన్నీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లతో పాటు త్రివిక్రమ్‌తో ఓ భారీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే.
పౌరాణిక గాథగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరపైకి రానున్న ఈ సినిమా గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. ముందు ఈ ప్రాజెక్ట్ బన్నీ చేస్తాడని, ఆ తరువాత ఎన్టీఆర్ అని, ఆ తరువాత బన్నీనే మళ్లీ లైన్‌లో ఉన్నాడని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే దీన్ని బన్నీ చేయాలంటే చాలా రోజులు కేటాయించాలి. ఈ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌ల మధ్య దీనికి డేట్స్ కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ తరువాత బన్నీ ఏ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో బాసిల్ జోసెఫ్ సినిమాకే అల్లు అర్జున్ డేట్స్ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే త్రివిక్రమ్‌కు షాక్ ఇవ్వడం ఖాయం అన్నమాట.
