Begin typing your search above and press return to search.

బన్నీ బ్రాండ్.. స్టెప్ బై స్టెప్ ఎదగడమంటే ఇదేనేమో!

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు కేవలం నేమ్ కాదు.. ఒక బ్రాండ్ అనే చెప్పాలి.

By:  M Prashanth   |   6 Jan 2026 5:00 PM IST
బన్నీ బ్రాండ్.. స్టెప్ బై స్టెప్ ఎదగడమంటే ఇదేనేమో!
X

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు కేవలం నేమ్ కాదు.. ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఒకప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన తన స్టార్ ఇమేజ్‌ ను ఇంటర్నేషనల్ లెవెల్ కు పెంచుకున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ తన కెరీర్‌ ను నిర్మించుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారారని చెప్పాలి.

నిజానికి.. అల్లు అర్జున్ ప్రయాణం సాధారణంగా మొదలై అసాధారణంగా మారింది. టాలీవుడ్ లో వివిధ సినిమాలతో మెప్పించిన ఆయన, మాలీవుడ్ మార్కెట్‌ లో డబ్బింగ్ మూవీతో క్రేజ్ సంపాదించుకున్న తెలుగు తొలి హీరోగా నిలిచారు. ఆర్య సినిమా మలయాళంలో డబ్బింగ్ రూపంలో విడుదలై అక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పటి వరకు మలయాళ మార్కెట్‌ లో తెలుగు హీరోలకు అంత పెద్దగా క్రేజ్ లేదనే చెప్పాలి.

కానీ అల్లు అర్జున్ స్టైల్, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మాలీవుడ్ ప్రేక్షకులను ఫుల్ గా ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి ఆయనకు సౌత్‌ లో తొలి బలమైన అడుగు పడింది. ఆ తర్వాత కేవలం ఒక ఇండస్ట్రీకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా పుష్ప మూవీతో గుర్తింపు పొందారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం, కేవలం సినిమా మాత్రమే కాదు.. బన్నీకి ఒక ఫెనామెనాన్‌గా మారింది.

హిందీ బెల్ట్‌ లో అల్లు అర్జున్‌ కు ఊహించని స్థాయిలో అభిమానులను తెచ్చిపెట్టింది. దీంతో బన్నీ నేషనల్ స్టార్‌ గా మారిపోయారు. అక్కడితో ఆగలేదు. పుష్ప 2తో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా బిహార్‌ లో నిర్వహించిన ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా జరిగింది.

ఆ ఒక్క ఈవెంట్‌ తో పుష్ప 2 స్థాయి పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. అసలు ఆశ్చర్యం జపాన్ మార్కెట్. తెలుగు హీరోగా అక్కడ భారీ క్రేజ్ సంపాదించుకోవడం చాలా అరుదైన విషయం. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జపాన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. అక్కడి నుంచి ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇది బన్నీ ప్లానింగ్‌ కు పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.

ఇప్పుడు అల్లు అర్జున్ దృష్టి కోలీవుడ్ పై పడింది. తమిళ ఇండస్ట్రీలో బలమైన మాస్ ఇమేజ్ ఉన్న ప్రముఖ డైరెక్టర్ అట్లీతో కలిసి బన్నీ చేస్తున్న సినిమా.. సూపర్ హీరో కాన్సెప్ట్‌ తో రూపొందుతుంది. దీంతో ఆ భారీ ప్రాజెక్టు.. ఇది కేవలం తమిళ మార్కెట్‌ నే కాదు.. అంతర్జాతీయ మార్కెట్‌ ను కూాడ టార్గెట్ చేసిన సినిమాగా మారే అవకాశముంది.

మొత్తంగా చూస్తే మాలీవుడ్ నుంచి మొదలై, పాన్ ఇండియా, జపాన్, ఓవర్సీస్, ఇప్పుడు కోలీవుడ్ వరకు.. అల్లు అర్జున్ ప్రయాణం ఒక క్లియర్ ప్లాన్ తో సాగుతోంది. రాజ్యాలను ఒక్కొక్కటిగా జయించే రాజులా, ఒక్కో మార్కెట్‌ ను తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో ఆయన అన్ని ఇండస్ట్రీలను ఏలుతారా? అలెగ్జాండర్ స్థాయిలో పేరు సంపాదిస్తారా? అన్నది కాలమే చెప్పాలి.