Begin typing your search above and press return to search.

స్టైల్ కా బాప్: అట్లీ+ బ‌న్నీ= అంత‌కుమించి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్టైలిస్ స్టార్ అనే ఇమేజ్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు.

By:  Srikanth Kontham   |   12 Dec 2025 1:39 PM IST
స్టైల్ కా బాప్: అట్లీ+ బ‌న్నీ= అంత‌కుమించి!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్టైలిస్ స్టార్ అనే ఇమేజ్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. కానీ బ‌న్నీ స్టైలింగ్ లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. స్టైలింగ్ లో న్యూట్రెండ్ ఫాలో అవ్వ‌డం...అందులో ఓ ట్రెండ్ ని సృష్టించ‌డం అతడికే తెలిసిన టెక్నిక్. టాలీవుడ్ లో చాలా మంది హీరో లున్నా రు. రామ్ చ‌ర‌ణ్, మ‌హేష్‌, ఎన్టీఆర్ , ప్ర‌భాస్ ఇలా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్లే వీళ్లంతా. కానీ వాళ్లెవ్వ‌రూ స్టైలింగ్ ను పెద్ద‌గా అనుస‌రించారు.

ఎక్క‌డైనా ఒకేలా:

ఆన్ ది స్క్రీన్ త‌ప్ప ఆఫ్ ది స్క్రీన్ లో ఆ ర‌కంగా ఉండేందుకు ఆస‌క్తి చూపించారు. కానీ బ‌న్నీ మాత్రం ఆఫ్ ది స్క్రీన్ లోనూ స్టైలింగ్ ను అనుస‌రించ‌డంలో మాస్ట‌ర్. తెర ముందు ఎలా క‌నిపిస్తాడో? తెర వెనుక కూడా అంతే ఫ్యాష‌న్ తో స్టైలింగ్ ను ఫాలో అవుతాడు. అందుకే స్టైలిష్ స్టార్ అయ్యాడు? అన్న‌ది అంతే వాస్త‌వం. ప్ర‌స్తుతం అట్లీ ద‌ర్శ‌క త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బ‌న్నీ ఎంత స్టైలిష్ గా క‌నిపిస్తాడు? అన్న దానిపై చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది.

స్లిమ్ లుక్ లో బ‌న్నీ:

ఈ విష‌యంలో అట్లీ ఎంత మాత్రం రాజీ ప‌డే ద‌ర్శ‌కుడు కాదు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే విదేశీ స్టూడియోల్లో బ‌న్నీ స్టైలిష్ లుక్ కి సంబంధించిన ఎన్నో టెస్ట్ లు జ‌రిగాయి. దీని వెనుక ఎంతో మంది డిజైనర్లు ప‌ని చేసారు. ఫైన‌ల్ గా ఓ లుక్ డిసైడ్ అయింది. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అట్లీ సంతృప్తి చెందే లుక్ ఒక‌టి రెడీ అయింది. సినిమాలో ఆ లుక్ ఎలా ఉంటుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రం. తాజాగా బ‌న్నీ పిక్ ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఓ సినిమా ప్ర‌మోష‌న్ లో పాల్గొన‌డంతో బ‌న్నీ శారీర‌క కొల‌త‌ల ప‌రంగా చూస్తే ఇలా క‌నిపిస్తాడ‌ని అంచ‌నా వేయోచ్చు.

అట్లీ నే ఫాలో అవుతున్నాడా:

మునుప‌టి కంటే స్లిమ్ అయ్యాడు. గ్రే హెయిర్ స్టైల్ లో క‌నిపిస్తున్నాడు. నెక్ పై డిజైన‌ర్ చైన్ లు ధ‌రించాడు. ఇందు లో స్ప‌ష్టంగా అట్లీ డిజైన్ క‌నిపిస్తుంది. అట్లీ కూడా ఎంతో స్టైలిష్ గా ఉంటాడు. తెర వెనుక హీరో అయినా? స్టైలింగ్ లో అట్లీ ఎక్క‌డా త‌గ్గ‌డు. వీలైనంత వ‌ర‌కూ మోడ్ర‌న్ గా క‌నిపించ‌డానికి ఆస‌క్తి చూపిస్తాడు. డిజైన‌ర్ దుస్తులు...చైన్ల లు ధ‌రిస్తుంటాడు. తాజాగా బ‌న్నీ లుక్ చూస్తుంటే? అట్లీ టేస్ట్ స్ప‌ష్టంగా క‌నిపిస్తొంది అనొచ్చు.